శంకర్ మహాదేవన్, జకీర్ హుస్సేన్ ఆల్బమ్ “దిస్ మూమెంట్ “కు అత్యుత్తమ గ్లోబెల్ మ్యూజిక్ ఆల్బమ్ గా గ్రామీ అవార్డు గెలుచుకుంది. 8 పాటలతో కూడిన శక్తి ఆల్పమ్ 2023 జూన్ లో విడుదలయింది. భారత సంగీత చరిత్రలో గుర్తుండి పోయే రోజు ఇది. గ్రామీ అవార్డ్స్ 2024లో ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్ కు గాను గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా అవార్డు అందుకున్నారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ చరిత్ర సృష్టిం చిన ఈ ఏడాది గ్రామీ వేడుకల్లో భారత్ మెరిసింది. మూడుసార్లు గ్రామీ అవార్డు గ్రహీత భారతీయ స్వరకర్త రికీ కేజ్ ఈ వార్తను ఎక్స్ లో పంచుకున్నారు . ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు తెలివైన భారతీయ సంగీతకారులు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారని ఆయన ప్రశంసించారు. జస్ట్ అమేజింగ్…భారతదేశం అన్ని వైపులాప్రకాశిస్తోందన్నారు. శంకర్ మహదేవన్, సెల్వగణేష్ వినాయకరామ్, గణేష్ రాజగోపాలన్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అద్భుతమని చెప్పారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, ప్రముఖ వేణువు వాద్యకారుడు రాకేష్ చౌరాసియా రెండో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. అదో అపూర్వం.. అని రికీ కేజ్ చెప్పారు.