ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులకు అరుదైన జ్ఞానపీఠ్ అవార్డులు దక్కాయి. వీరిద్దరూ 2023 ఏడాదికి చెందిన 58వ జ్ఞాన పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. రెండు భాషల్లో ప్రముఖ రచయితలైన ఇద్దరికీ జ్ఞానపీఠ్ ఇవ్వడం సముచితం..రెండు భాషల సాహిత్యానికి అపూర్వమైన గౌరవం లభించింది. సంస్కృత సాహితీ వేత్త జగద్గురు రామభద్రాచార్య , ఉర్దూ కవి గుల్జార్ లను ఈ అవార్డుకు కమిటీ ఎంపిక చేసింది. సుమారు 1944 లో ఏర్పాటైన జ్ఞానపీఠ్ అవార్డును భారాతీయ సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఏటా ఇస్తుంటారు. సంస్కృత భాషకు రెండోసారి ఈ అవార్డు దక్కింది. ఉర్దూ సాహిత్యానికి ఐదోసారి ఈ జ్ఞాన పీఠ్ అవార్డ్ దక్కింది. అవార్డ్ కింద 21 రూ . లక్షల నగదు సరస్వతీ విగ్రహం , ప్రశంసా పత్రం అందజేస్తారు.
ఉర్దూ కవి గుల్జార్
హిందీ సాహిత్యంలో ఎంతో ప్రఖ్యాతి చెందారు గుల్జార్. ఆయన ఒక సిక్కు కుటుంబంలో సంపూరన్ సింగ్ కల్రాగా జన్మించారు.. ఉర్దూ కవిత్వం, సినీ సాహిత్యంలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. ఉర్దూ కవిత్వంలోనూ ఆయన దిట్ట. గుల్జార్ 2002లో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2004లో ఉర్దూ సాహిత్యానికి గానూ పద్మభూషన్ అవార్డుతో ఆయనను కేంద్రం సత్కరించింది. గుల్జార్ హిందీ చిత్రసీమకు చేసిన కృషికి గుర్తింపుగా 2013లో ఆయనకు దాదాసా హెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆయనకు 5 జాతీయ చలన చిత్ర అవార్డులు దక్కాయి. స్లమ్ డా్ మిలీనియర్ లో ఆయన రాసిన జైహో పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది. అదే పాట 2010లో గ్రామీ అవార్డ్ కు ఎంపికైంది. మాచిస్ , ఓంకార, దిల్ సే, గురు, చిత్రాల్లో ఆయన రాసినపాటలు ఎంతో ఆదరణ పొందాయి. సినీ సాహిత్యంతో పాటు సినీ దర్శకుడిగా కూడా రాణించారు. ఆయన దర్శకత్వం వహించిన కోషిష్ , పరిచయ్, ఇజాజత్ ….చిత్రాలతోపాటు టీవీ సీరియల్ మీర్జా గాలీబ్ కు దర్శకత్వం వహించారు. సినీ ప్రయాణంతోపాటు ఉర్దూ సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆయన బాలల సాహిత్యానికి విశేషంగా కృషి చేస్తున్నారు.
22 భాషల పండితుడు రామభద్రాచార్య
రామభద్రాచార్య వారి ప్రతిభాపాటవాలు అయోధ్య రామమందిర వివాదాన్నిపరిష్కరించడంలో ఎంతో సహకరిం చింది. అప్పటి నుండి రామభద్రాచార్య అంటే తెలియని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు దాదాపు 22 భాషల పట్ల మంచి పట్టుంది. ఆయన చిత్రకూట్ లోని తులసీ పీఠం వ్యవస్థాపకుడు.బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన హిందూ ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందారు. ఆయన ఆధ్యాత్మిక వేత్తగా …రచయితగా ….విద్యావేత్తగా సుప్రసి ద్ధుడు. ఆయన దాదాపు 240 పుస్తకాలు ..ఇతిహాసాలను రచించారు. ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువుల్లో రామభద్రాచార్య ఒకరు…. 1982 నుంచి ఆయన జగద్గురువుగా వ్యవహరిస్తున్నారు. 2015లో ఆయనకు పద్మ విభూషణ్ అవార్డ్ దక్కింది.వారి అసలు పేరు గిరిధర మిశ్ర. ఆయన రెండు నెలల వయపులోనే ట్రకోమావల్ల కంటిచూపు కోల్పా యారు… దీంతో వారి తాత దగ్గర ఆయన ఓనమాలు దిద్దారు. ఐదేళ్ల వయసు నాటికే భగవద్గీత మొత్తాన్ని కంఠో పాఠంగా చెప్పేస్ధాయికి వచ్చారు. ఎనిమిదేళ్ల వయసు నాటికే రామచరిత మానస్ అభ్యసించారు..ఇలా ఆయన బాల్యం నుంచే ఎన్నో అద్భుతాలు చేశారు…అంధుడై కూడా వారు సాధించిన విజయాలు లోకానికి మార్గదర్శకాలుగా నిలి చాయి.