30.6 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

గులాబీ దళంలో ఏం జరుగుతోంది ?

    ప్రతిపక్షంలోకి రావడంతో గులాబీ పార్టీలో కలవరం మొదలైందా…? కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారా. ..? బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు హస్తం పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్తున్నారా.? బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కొంత మంది నేతలు దూరంగా వుంటున్నారా…? కారు పార్టీలో ఏం జరుగుతోంది.?

     తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి క్యూ కడుతున్నారు. ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మానిక్ రావు రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమ నియోజకవర్గ అభివృద్ధి అంశంతో పాటు, ప్రోటోకాల్ ఇవ్వడంలేదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డిదృష్టికి తీసుకువెళ్లినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యే లు వివరణ ఇచ్చారు. పార్టీ మారుతున్నారని ప్రచారం జరగ్గా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ మార్పు అంశాన్ని ఖండిం చారు. ఇక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారనే చర్చ జరిగింది. దీంతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని మర్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లు వివరణ
ఇచ్చారు. ఇక తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ నగర మేయర్‌గా అభివృద్ధి అంశాలపై చర్చించడంతో పాటుగా జీహెచ్ఎంసీ కమిషనర్ సహకరించడం లేదనే విషయాన్ని సీఎంతో చర్చించినట్లుగా మేయర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అంశాలపై రివ్యూ చేసేటప్పుడు తనను పిలవాలని రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారు.

   ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో అసంతృప్తిగా ఉన్న నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని భావిస్తున్న పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమవుతున్నట్లుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావి స్తోంది. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని బీఆర్ఎస్ పార్టీపై ప్రయోగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనుకున్న మేరకు ఫలితాలు రాలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్ నుండి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి బీఆర్ఎస్  పార్టీని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, అతని సతీమణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి గాంధీ భవన్‌లో దీపా దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో వైపు మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితా రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోనే చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ దూకుడుతో బబీఆర్ఎస్ పార్టీలో అలజడి రేగింది. దీంతో అలర్టయిన గులాబీ బాస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీలో కాంగ్రెస్ పార్టీ ట్రాప్‌లో పడద్దని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ రెడ్డిని కలవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలకు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు అధినేత కేసీఆర్ ఆదేశాలు పాటిస్తారా లేదా అనేది చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్