20.7 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

గుడ్ బై జగన్ అంటున్న వైసీపీ నేతలు ….

       వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీ లు ఇలా వరుస గా… ఒకరి తరువాత ఒకరు రాజీనామా బాట పడుతున్నారు. వైసీపీ లో కొనసాగలేమంటూ టిడిపి, జనసేన పార్టీల బాట పడుతున్నారు. వైసీపీ లో టికెట్ దక్కక కొందరు… టికెట్ ఇచ్చినా గెలుపు పై నమ్మకం లేని మరి కొందరు జగన్ కి షాక్ ఇస్తున్నారు.

        వైఎస్ఆర్ సీపీలో ముసలం పుట్టింది. పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పార్టీ నేతలు ఒక్కొక్కరు సీఎం జగన్ కు గుడ్ బై అంటున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామ క్రిష్ణ రెడ్డి తో మొదలైన రాజీనామా లు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ వైసీపీకి రాజీనామా చేశారు. బాల శౌరీ ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహి తుడు అనే పేరుంది. మొదటి నుంచి వైసీపీ లో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో. మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఆయనకు దక్కదనే ప్రచారం పార్టీలో జరుగుతుంది. దీనికి తోడు పెనమలూరు ఎమ్మెల్యే పార్థ సారథి ని పోటీ కి దింపేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేశా రు. అందుకు పార్థసారథి సానుకూలంగా స్పందించ లేదు. పైగా టిడిపి లోకి వెళ్లేందుకు సిద్దం అయ్యారు. మచిలీ పట్నం ఎంపీ సీటు కి పార్థ సారథి తెర పైకి తీసుకు రావడం పై బాలశౌరి తీవ్ర అసంతృప్తి గా వున్నారు. దీనికి తోడు మాజీ మంత్రి పేర్ని నాని తో కొద్ది రోజులుగా రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అయన వైసీపీ కి గుడ్ బై చెప్పారు.

      ఎంపీ బాల శౌరీ ఇక మీదట జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జనసే న అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి పని చేయనున్నట్లు వెల్లడించారు. ఇక కొద్ది రోజుల క్రితమే కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ కూడా వైసీపీ కి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో అయన మొదటి సారి వైసీపీ నుంచి కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు. కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మంత్రి జయరామ్ ని రంగంలోకి దింపడం తో ముందుగానే అయన వైసీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పలువురు ఎమ్మెల్యేలు కూడా గుడ్ బై చెబుతున్నారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో పార్టీలో చిచ్చురేగింది. మంగళగిరి నియోజక వర్గ బాధ్యతలు గంజి చిరంజీవికి ఇచ్చారు. దీంతో ఆర్కే అంతకంటే ముందే వైసీపీ కి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామ చంద్రారెడ్డి టికెట్ కోసం చివరి వరకూ ప్రయత్నం చేశారు. అయినా సీఎం సానుకూలంగా స్పందించక పోవడంతో జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాపు రామ చంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తమ గొంతు కోశారని ఫైర్ అయ్యారు. ఇక పెనమలూరు ఎమ్మెల్యే పార్థ సారథి వైసీపీని వీడటం, త్వరలో టిడిపి తీర్థం పుచ్చుకోవడం ఖాయం అయ్యింది. మూడో జాబితా లో టికెట్ దక్కని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కూడా పార్టీ పై అసంతృప్తి గా వున్నారు.

     ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు… వైసీపీ ఎమ్మెల్సీ లు కూడా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. విశాఖ కు చెందిన ఎమ్మె ల్సీ వంశీ కృష్ణ యాదవ్ వైసీపీ కి రిజైన్ చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సి. రామ చంద్రయ్య కూడా టిడిపి లో చేరారు. ఇక గుంటూరు ఎంపి అభ్యర్థిగా భావించిన క్రికెటర్ అంబటి రాయుడు సైతం వైసీపీ లో చేరిన పది రోజుల్లోనే జగన్ పార్టీ ని కాదని జన సేన తీర్థం తీసుకోవడానికి రెడీ అయ్యారు.పార్టీ అభ్యర్థులను పెద్దఎత్తున మారుస్తూ, వారి నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులూ చేస్తూ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రయోగం బెడిసి కొట్టింది. జగన్ వైఖరిలో మాత్రం మార్పులేదు. మార్పులు, చేర్పులతో నాల్గో జాబితా నేడో రేపో విడుదల చేస్తున్నారు. ఈ ప్రయోగం వైఎస్ఆర్ సీపీకి కలిసివస్తుందా.. వికటిస్తుందా చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్