35.4 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

గాడి తప్పిన గవర్నర్ల వ్యవస్థ !

        బ్రిటీష్ పాలననాటి అవశేషమే గవర్నర్ల వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా ఉంటే, గవర్నర్ రాష్ట్ర అధినేతగా ఉంటారు. రాజ్యాంగంలో గవర్నర్లకు విచక్షణాధికా రాలు ఉన్న మాట వాస్తవమే. అయితే, ఈ విచక్షణాధికారాలను రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే ఉపయోగించు కోవాల్సి ఉంటుంది. రాజ్యాంగ నిపుణులు చాలా సార్లు ఈ విషయం స్పష్టం చేశారు. అంతేతప్ప విచక్ష ణాధికారాల పేరు చెప్పుకుని సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే అధికారం గవర్నర్లకు రాజ్యాంగం ఇవ్వ లేదు. కాలక్రమంలో రాజ్‌భవన్‌లు సమాంతర అధికార కేంద్రాలుగా మారుతున్నాయి.

     తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవి మరోసారి వివాదాల్లోకి వచ్చారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసన సభకు వచ్చిన గవర్నర్ రవి సభలో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. జాతీయ గీతాన్ని తమిళనాడు ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపిస్తూ ప్రసంగించకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. అంతేకాదు ప్రభుత్వం రూపొందించిన తన ప్రసంగంలోని అనేక అంశాలతో తాను విభేదిస్తున్నట్లు రవి పేర్కొన్నారు. తమిళనాడు గవర్నర్ రవి ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. కిందటేడాది కూడా ప్రసంగం విషయంలో గవర్నర్ ఇలాగే వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలోని కొన్ని వాక్యాలను ఆయన ఉద్దేశపూర్వకంగా చదవలేదు. పైపెచ్చు ప్రసంగప్రతిలో లేని అనేక అంశాలను తన ఇష్టానుసారం సభలో చదివారు. గవర్నర్ ఈ వ్యవహారం అప్పట్లో తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. రాజ్యాంగంలో పేర్కొన్నే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా గవర్నర్లు మారారన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

తమిళనాడు పేరు మార్చడానికి సంబంధించి కిందటేడాది గవర్నర్ రవీంద్ర నారాయణ రవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సహజంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొం దిస్తుంది. మంత్రి మండలి రూపొందించిన ప్రసంగ ప్రతిని గవర్నర్ చదువుతారు. అంతేకానీ క్యాబినెట్ రూపొందించిన ప్రసంగ ప్రతిని పక్కన పడేసి సొంతంగా ఉపన్యాసం ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయితే కిందటేడాది శాసనసభలో ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్ తనకు తోచినట్లు మాట్లాడటంతో గొడవ మొదలైంది. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ద్రవిడియన్‌ మోడల్‌ అనే అంశాలను ప్రస్తావించకుండా గవర్నర్ రవి ప్రసంగాన్ని కొనసా గించారు. దీంతో గవర్నర్ రవి ప్రవర్తనపై డీఎంకే తీవ్రస్థాయిలో మండిపడింది. చెన్నై నగరంలోని అనేక ప్రాంతాల్లో గెట్ అవుట్ రవి ….అంటూ పోస్టర్లు కూడా వేసింది. ఒకదశలో డీఎంకే పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి గవర్నర్ రవిని రీకాల్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఒక్క తమిళనాడే కాదు బీజేపీయేతర పార్టీలున్న ప్రతి రాష్ట్రంలోనూ రాజ్‌భవన్‌లు సమాంతర అధికార కేంద్రాలుగా మారాయి. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు ప్రతిరోజూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో గొడవలే. పౌరసత్వ సవరణ చట్టంతో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ సర్కార్ మధ్య వివాదం ప్రారంభమైంది. తెలంగాణలో అయితే కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై మధ్య ఏర్పడ్డ విభేదాల సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉండగా, సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిం చడానికి కూడా గవర్నర్ తమిళిసై వెనుకాడలేదు.

గవర్నర్ల వ్యవస్థ ఇంకా కొనసాగాలా ?
బ్రిటిష్ పాలననాటి అవశేషమే గవర్నర్ల వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా ఉంటే, గవర్నర్ రాష్ట్ర అధినేతగా ఉంటారు. రాజ్యాంగంలో గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉన్న మాట వాస్తవమే. అయితే, ఈ విచక్షణాధికారాలను రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే ఉపయోగించు కోవాల్సి ఉంటుంది. రాజ్యాంగ నిపుణులు చాలాసార్లు ఈ విషయం స్పష్టం చేశారు. అంతేతప్ప విచక్ష ణాధికారాల పేరు చెప్పుకుని సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే అధికారం గవర్నర్లకు రాజ్యాంగం ఇవ్వ లేదు. మౌలికంగా మనది సమాఖ్య వ్యవస్థ. ఫెడరలిజమే స్ఫూర్తి కావాలని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశించారు. అయితే, సమాఖ్య వ్యవస్థకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తూట్లు పొడుస్తున్నాయి. దీంతో గవర్నర్ల వ్యవస్థ చుట్టూ వివాదాలు నెలకొంటు న్నాయి. రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించాల్సిన గవర్నర్, కేంద్రంలోని అధికార పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారన్న ఆరోప ణలొస్తున్నాయి. ఫలితంగా మొత్తంగా గవర్నర్ల వ్యవస్థే వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ముఖ్య మంత్రులతో గొడవల నేపథ్యంలో అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా ? అనే ప్రశ్న కూడా తెరమీదకు వస్తోంది. తెల్లదొరల నుంచి అరువు తెచ్చుకున్న గవర్నర్ల వ్యవస్థకు చరమగీతం పాడాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఉండగా, అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరం ఏమిటి ? అని సామాజిక శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్