29.1 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

గత ప్రభుత్వ ఆర్థిక సంస్థల నిర్వహణలో లోపాలు

   భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థలోని లోపాలను కూడా కంప్ట్రోలర్ అండ్ జనరల్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ తీరుతెన్నులపై 2022 మార్చితో ముగిసిన ఏడాదికి చెందిన విశ్లేషణను నివేదిక రూపంలో తాజాగా తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టింది.

      భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసిందని కాగ్ నివేదిక పేర్కొంది. బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన అప్పులు రానున్న పది సంవత్సరాల్లో వడ్డీతో సహా తీర్చాల్సి ఉందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు చేసిన అప్పుల భారం ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పడిందని నివేదిక కుండబద్దలు కొట్టింది. గులాబీ పార్టీ ప్రభుత్వానికి ఏడాదికేడాది పన్నుల రూపంలో ఆదాయం పెరిగి న విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ జనరల్ నివేదిక ప్రస్తావించింది. అయితే సర్కార్‌కు ఆదాయం పెరిగినా, మిగులు కనిపించడం లేదని కంప్ట్రోలర్ అండ్ జనరల్ వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా దళితబంధు అంశాన్ని కాగ్ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తా వించింది. దళిత బంధు పథకానికి పెద్ద ఎత్తున నిధులున్నా, లబ్దిదారులకు అందడంలో జాప్యం జరిగిందని కాగ్ రిపోర్ట్ వెల్లడించింది.

       తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక నిర్వహణ సైతం బాగా లేదని కంప్ట్రోలర్ అండ్ జనరల్ నివేదిక పేర్కొంది. తెలంగాణలోని మొత్తం 67 కార్పొరేషన్లలో 39 సంస్థలు మాత్రమే లెక్కలు సమర్పిం చాయని రిపోర్ట్ వెల్లడించింది. వీటిలో 17 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉండగా, 18 కార్పొరేషన్లు నష్టాల్లో ఉన్నాయని కాగ్ నివేదిక పేర్కొంది. ప్రభుత్వరంగ సంస్థల నష్టం దాదాపు రూ. 56,613 కోట్లమేర ఉందని కాగ్ స్పష్టం చేసింది. అయితే కేవలం 12 సంస్థలే తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి స్టేట్‌మెంట్లు ఇచ్చాయని కాగ్ నివేదిక పేర్కొంది. 51 సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని వెల్లడించింది. మొత్తంగా తెలంగాణలో గత సర్కార్ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక నిర్వహణలో అనేక లోపాలున్నాయని కంప్ట్రోలర్ అండ్ జనరల్ నివేదిక కుండబద్దలు కొట్టింది. గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తావిస్తూ ఇందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ. 66,854 కోట్ల అసలు, దానిమీద వడ్డీ కలిపి మొత్తం రూ.1.41 లక్షల కోట్లు ఉంటుందని నివేదిక వివరించింది. దీంతోపాటు ద్రవ్య జవాబుదారీ, చట్టం నిర్వహణ చట్టం. ఎఫ్ ఆర్‌ బీఎం నిబంధనలను కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉల్లంఘించిందని కాగ్ నివేదిక కుండ బద్దలు కొట్టింది. అలాగే 15వ ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ఉల్లంఘన కూడా జరిగిందని ఈ రిపోర్ట్ పేర్కొంది.

       ప్రజల కనీస అవసరాలకు తాము పెద్ద పీట వేసామని గులాబీ పార్టీ ప్రభుత్వం చెప్పుకోవడాన్ని కాగ్ రిపోర్ట్ అపహాస్యం చేసింది. ప్రాధాన్యం ఇవ్వాల్సిన విద్య, వైద్య రంగాలకు బీఆర్ఎస్ సర్కార్ ఆయా బడ్జెట్‌ లలో తక్కువ నిధులు కేటాయించిందని కంప్ట్రోలర్ అండ్ జనరల్ నివేదిక కుండబద్దలు కొట్టింది. అలాగే సంక్షేమ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించినట్లు గులాబీ పార్టీ చెప్పుకోవడాన్ని కాగ్ రిపోర్ట్ తప్పు పట్టింది. లెక్కలు పరిశీలిస్తే, సంక్షేమ రంగానికి బీఆర్ఎస్ సర్కార్ తక్కువ నిధులే కేటాయిం చిందని కాగ్ రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది. గోదావరి నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని తీసుకునేలా డీపీఆర్‌లో పాత ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని రిపోర్ట్ ప్రస్తావించింది. అయితే థర్డ్ టీఎంసీని కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ప్రాజెక్ట్ డిజైన్‌లో గులాబీ పార్టీ ప్రభుత్వం మార్పులు చేసిందని కాగ్ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ సర్కార్ దాచిపెట్టిందని కంప్ట్రోలర్ అండ్ జనరల్ నివేదిక వెల్లడించింది. అంతేకాదు థర్డ్ టీఎంసీ నీరు వాడుకోవడానికి సంబంధించి కేంద్రం నుంచి అవసరమైన అనుమ తులను కూడా తీసుకోలేదని కాగ్ ఎత్తి చూపింది.

     కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు భూకంప ప్రమాదం ఉందన్నది కాగ్ నివేదిక అంతరార్థం. అయితే మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు భూకంపం ప్రభావాన్ని అధ్యయనం చేయ కుండానే రూ. 6,126 కోట్లతో రిజర్వాయర్‌ను గత ప్రభుత్వం నిర్మించిందని కాగ్ వెల్లడించింది. మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ విషయంలో నీటిపారు దల శాఖ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి వాడే పంపుసెట్లకు విద్యుత్ రూపంలో ఏడాదికి 8,459 మెగావాట్ల అవసరం ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో దాదాపు 46.82 శాతం అని వివరించింది. అన్ని పంపులూ ఒకేసారి పనిచేస్తే రోజుకు 203 మిలియన్ యూనిట్లు అవసరమవుతుందని కాగ్ నివేదిక పేర్కొంది. మొత్తంమీద కాళేశ్వరం కరెంటు బిల్లులు ప్రభుత్వానికి గుదిబండగా మారాయని కంప్ట్రోలర్ అండ్ జనరల్ నివేదిక వెల్లడిం చింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్