ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో నిందితుడైన నిఖిల్ గుప్తాకు ఆధారాలు అందించేందుకు అమెరికా నిరాకరించింది. అమెరికా విజ్ఞప్తి మేరకు నిఖిల్ గుప్తాను గతేడాది జూన్ లో చెక్ రిపబ్లిక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాగ్ జైల్లో ఉన్న అతడిని ఆధీనంలోకి తీసుకోవడం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 4న గుప్తా తరపు న్యాయవాది. న్యూయార్క్ లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. “ఈ కేసులో అతడిపై నేరాబియోగాలు మోపిన అమెరికా ఆధారాలు, ఆరోపణలను బలపర్చే పత్రాలను అందజేయలేదు. న్యాయవాదులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జైల్లో అతడిని అగ్రరాజ్య అధికా రులు పలుమార్లు ప్రశ్నించారు. ఈ కేసులో అతడు విచారణ ఎదుర్కోవాలంటే ముందు కేసుకు సంబంధించిన వివరాలను అందజేయాలి” అని గుప్తా న్యాయవాది అభ్యర్ధించారు..
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయ స్థానం స్పందన తెలియజేయాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. ఈ క్రమంలోనే బుధవారం ఫెడరల్ ప్రాసి గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రాసిక్యూటర్లు కోర్టుకు తమ సమాధానం తెలియజేశారు. గుప్తా అభ్యర్ధనను తాము వ్యతిరేకిస్తు న్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ కేసులో గుప్తా న్యూయార్క్ కోర్టులో హాజరైనప్పుడు మాత్రమే తాము ఆధారాలను అందజేస్తామన్నారు.పన్నూ హత్య కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసిం దని, ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినట్లు గతంలో అంతర్జా తీయ మీడియా కదనాలు వెల్లడించిన సంగతి తెలిసించే ఓ భారత అధికారితో కలిసి నిఖిల్ గుప్తా ఈ కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి.