ఖమ్మం జిల్లాలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో వివాదం నెలకొంది. సత్తుపల్లి మున్సిపాలిటీ లోని 17వ వార్డులో రభస జరిగింది. మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేశ్ ప్రొటోకాల్ ప్రకారం తనను అధికారులు, సిబ్బంది కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ప్రతిరోజూ ప్రొటో కాల్ ప్రకారం పిలుస్తున్నామని, ప్రతిరోజూ వస్తూ.,,ఇప్పుడు పిలవ లేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టడం సరికాదన్నారు అధికారులు. ప్రజా పాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరనీయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బురదజల్లేందుకే ఈ రభస చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం వ్యవహరిస్తున్నా.. కార్యక్రమంలో రసాభా స సృష్టించేందుకే యత్నిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.