దేశంలో సామాన్య పౌరులపై కరెంట్ చార్జీల భారం పడకుండా కేంద్రం బడ్జెట్ లో ప్రకటన చేసింది. ఇప్పుడు దాని అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగు వేసింది. సౌర విద్యుత్ వాడకం విస్తరిం చేందుకు కేంద్రం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. సౌర విద్యుత్ ప్రయోజనాన్ని పొందేందుకు సంబంధిత వెబ్‌సైట్లో దరాఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సుమారు 75 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ప్రాజెక్ట్ తో ప్రతి నెలా మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందించి దాదాపు కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ జరుగుతుందని మోదీ చెప్పారు. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణాల కూడా పొందవచ్చని…ప్రధాని మోదీ ఎక్స్ లో స్వయంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా మరింత సుస్థిర మైన అభివృద్ధిని సాధించడానికి పీఎం సూర్య ఘర్, ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభించారు.ఈ పథకానికి క్షేత్ర స్థాయిలో ప్రచారం కల్పించేందుకు నగరాల్లోని స్థానిక సంస్థలు, పంచాయితీలకు ప్రోత్సా హకం అందించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ముఖ్యంగా గృహ వినియోగదారులు, యువత సూర్య ఘర్ పథకాన్ని సపోర్ట్ చేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.