ఉగ్రవాదం, హింస, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొత్తం 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దేశవ్యాప్తంగా 90వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ పూర్తవ్వగానే లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవల పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.


