దేశంలో ప్రతి రాష్ట్రం మరో రాష్ట్రంతో సాంస్కృతికంగా ఏకత్వ భావనతో ఏకమైతే.. మన శక్తి మరింత పటిష్ట మవు తుందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. పొంగల్ ఉత్సవాలు కూడా ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ అనే భావనను పెంచుతుందన్నారు. ఫలితంగా 2047 కల్లా వికసిత్ భారత్ అన్న భావన , ఐక్యత పెంచుతుందన్నారు.గతంలో జరిగిన కాశీ తమిళ్ సంగమం, సౌరాష్ట్ర తమిళ్ సంగమం.. ఇదే సమైక్య భావనను ప్రతిబింబించాయని ప్రధాని వివరించారు. పొంగల్ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఇతరులు కూడా పాల్గొన్నారు. మోదీ తమిళ్ పంచకట్టు కట్టుకుని, పొంగల్ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. తమిళ నాడులో పొంగల్, ఇతర ప్రాంతాల్లో మకర సంక్రమణం, సంక్రాంతి జరుపుకుంటున్న దేశ ప్రజలందరికీ శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరతనాట్యం కార్యక్రమం నిర్వహించారు.


