28.7 C
Hyderabad
Sunday, October 26, 2025
spot_img

కాంగ్రెస్, సీపీఐల పొత్తు కంటిన్యూ ?

      తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు వస్తాయనేది ప్రస్తుతం చర్చగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందా.! లేక జాతీయ పార్టీలైన కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య ఉంటుదా? ఇంతకీ పార్టీల నడుమ పొత్తులు పొడిస్తే ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు.? ఇండియా కూటమి సీట్ల సర్దు బాటులో వామపక్షాలకు కేటాయించే స్థానాలు ఎన్ని?

   తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క సీటు కీలకంగా మారనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ పార్లమెం ట్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల మీద బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు మాగ్జిమం స్థానాలు కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇటు అధికార పక్షమైన కాంగ్రెస్, ఇటు ప్రతిప క్షస్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ సీట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే మధ్యలో బీజేపీ కూడా అసెం బ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపాలనే ప్రయత్నం బలంగానే చేస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇండియా కూటమిలో భాగస్వా ములైన కమ్యు నిస్టులు, కాంగ్రెస్ నేతల పొత్తు పార్లమెంట్ ఎన్నికల వరకు కంటిన్యూ కానుందా.. పొత్తులో భాగంగాఎన్ని సీట్లు ఎర్ర జెండాలకు కేటాయిస్తారు అనే అంచనాలు కామ్రెడ్లు వేస్తున్నారు.

       అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా కొత్తగూడెం ఒక్క స్థానం చివరాకరులో దక్కించుకొని అసెంబ్లీ లోకి మరో మారు అడుగు మోపారు. అదే పంథాలో మరో సారి తెలంగాణ నుంచి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని సీపీఐ నేతలు భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటుకు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన ఓటు శాతం ఆధారంగా సీట్ల కేటాయింపు ఉండాలని ఇండియా కూటమి ఆలోచనలు చేస్తోంది. అయితే కామ్రేడ్లు ఎటు వైపు ఉంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే ప్రచారం పెద్ద ఎత్తున మునుగోడు ఉప ఎన్నికల నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఫలితాలే నిదర్శనం అంటున్నారు. సొంతంగా గెలిచే సత్తా ప్రస్తుతానికి లేకపోయినా.. గెలుపు ఓటముల నిర్ణ యించే పార్టీలు అనే పేరు తెలంగాణలో కమ్యునిస్టు పార్టీలు సంపాదించాయి.

         తెలంగాణలో ఉన్న 17లోక్ సభ స్థానాల్లో కనీసం రెండు స్థానాలు సీపీఐ ఆశిస్తోంది. అయితే తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ టిక్కెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య పెద్దగానే ఉంది. అయితే కమ్యునిస్టు నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటులో భాగంగా గట్టి హోప్స్ పెట్టుకున్నారు. వామపక్షాలకు బలం ఉన్న ముఖ్యంగా నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఏవైనా రెండు సీట్లు కేటాయించాలని ప్రతిపాదన జాతీయ నాయకత్వం మీద పెట్టారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఖమ్మం,నల్గొండ,బెల్లంపల్లి,వరంగల్ ఎస్సీ రిజర్విడ్ స్థానాలలో ఏవైనా కేటా యిస్తారని గట్టి విశ్వాసంతో కామ్రేడ్లు ఉన్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ఎంపి టిక్కెట్లు ఆశించే నేతల పేర్ల లిస్ట్ పెద్ద దిగా ఉంది.0 ఈనేపథ్యంలో కమ్యూనిస్టులకు, అశించినన్ని స్థానాలు వస్తాయా. లేదా ఇచ్చిన స్థానాలతోనే సర్దుకోలా అన్నప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.చూడాలి మరి కాంగ్రెస్, కమ్యునిస్టు పొత్తు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని,బీఆర్ఎ స్‌ను నిలువరించడానికి కలసి వెళ్తారా! లేక ఒంటరిగా వెళ్తారా.! పొత్తు కుదురుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్