రాజ్యసభ ఎన్నికల వేళ ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే లతో పాటు.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది ఆసక్తిక రంగా మారింది. ఇవాళ ఆయా పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు నోటీసులు ఇచ్చారు. ఇదే తుది విచారణ నోటీసులని పేర్కొంటూ.. హాజరుకాకుంటే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో నేటి విచారణకు హాజరవుతారా? లేదా? అనే చర్చ నడుస్తోం ది.టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రెండు సార్లు స్పీకర్ ఎదుట హాజరయ్యారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఒక్కసారి హాజరయ్యారు రెబెల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అసలు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, మద్దాలి గిరి.