24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

ఏపీలో దుమారం రేపుతున్న వైవీ వ్యాఖ్యలు

    రాజధాని రచ్చతో రాజకీయ నేతలు విమర్శలు… ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయం మరోసారి రంజుగా మారింది. ముచ్చట గా మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి, ఉమ్మడి రాజధాని హైదరా బాద్ అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యా లు దేనికి సంకేతం. విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ ఇప్పుడు పక్క రాష్ట్రం పేరు ఎందుకు చెప్తుంది.. అసలు ఎన్నికల సమయం లో మరోసారి రాజధాని రచ్చ ఎందుకు తెర మీదకి తెచ్చింది.

      రాష్ట్ర రాజధానిపై ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. అయితే గత ప్రభుత్వం ఏపి రాజధాని అమరావతి అని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిర్మాణాలు చేప ట్టారు. అయితే అవి పూర్తి కాకుండానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్  మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించా రు. సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నాం అని రుషికొండ మీద నిర్మాణాలు చేపట్టారు. పలుమార్లు ముహుర్తాలు కూడా పెట్టారు. అయితే నెరవేరలేదు. ఇప్పుడు ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగ నున్న నేపథ్యంలో వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గా ఉంటే బావుంటుంది అని చెప్పడం ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది..విశాఖ పరిపాలన రాజధానిగా చేద్దాం అంటే న్యాయపరమైన ఇబ్బందు లున్నాయి. వాటిని అధిగమించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించాలని మా నాయకుడు జగన్ తో చర్చిస్తాం అని సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు ముక్కలాట అయిపొయింది. మళ్ళీ పక్క రాష్ట్రం పాట మొదలైంది అని విమర్శ లు చేస్తున్నారు.

     ఇది కేవలం వైసీపీ అవకాశవాద రాజకీయం అని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేవలం హైదరాబాద్ లో ఆస్తులు రక్షించుకోవడానికి బీఆర్ఎస్ నేత కేసీఆర్ తో కలిపి జగన్నాటకం మొదలు పెట్టారు అని ఘాటు గానే కామెంట్స్ చేస్తు న్నారు ప్రతిపక్ష నేతలు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇందుకు ప్రతి కౌంటర్ ఇస్తు మేము ఇప్పటికీ మూడు రాజధానుల స్టాండ్ మీదే ఉన్నాం అంటున్నారు. సుబ్బారెడ్డి విభజన హామీల కోసం మాత్రమే ప్రస్తావించారని వైసీపీ నేతలు సుబ్బా రెడ్డి వ్యాఖ్యలను సమర్ధించారు. బీజేపీ నేత జీవీఎల్ సైతం ఏపి రాజధాని అమరావతి అంటున్నారు. ఆత్మ నిర్బర్ ఏపి కావాలని వైసీపీ నేతల కి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు టీడీపి నేత దాడి వీరభద్రరావు సైతం నాలుగో రాజధానిగా ఇప్పుడు హైదరాబాద్ పేరు చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటో వైసీపీ చెప్పాలి అని కౌంటర్ వేశారు. ఏది ఏమైనా ఈ లీకులు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ గా చెప్పక తప్పదు… మరి చూడాలి రాజధాని అంశం ఎన్నికల అజెండాగా మారిపోయి మిగిలిపోతుందా లేక నేతల భవితని తిరగ రాస్తూందా అన్నది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్