అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ మరోసారి డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆరోపణలు వెల్లువె త్తాయి. అమెరికాలోని ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. మస్క్ తీరుపై టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల బోర్డు సభ్యులందరూ ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనానికి స్పందిం చిన , మస్క్ తన జవాబును ట్వీట్ చేశారు. ఒకప్పుడు తన స్నేహితుడైన రోగన్‌తో కలిసి గతంలో ఒకసారి డ్రగ్స్ సేవిం చింది నిజమేనని ఒప్పుకున్నారు. ఆ తర్వాత తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. నాసా అభ్యర్థనతో టెస్లా ఆఫీసును డ్రగ్స్ రహితంగా నిర్వహిస్తామని మస్క్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. నాసా అభ్యర్థన మేరకు వరుసగా మూడే ళ్లపాటు తాను వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. గత మూడేళ్లలో తన శరీరంలో డ్రగ్స్ , మద్యం ఆనవాళ్లు లేవని పరీక్షల రిపపోర్ట్ లు కూడా ఉన్నాయని చెప్పారు.


