ఎలక్ట్రోరల్ బాండ్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువ రించింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ సమాచార హక్కును హరిస్తాయని.. ఇది రాజ్యంగ విరు ద్ధమని వ్యాఖ్యానించింది. నల్లధ నాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమం జసం కాదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసిం ది.ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒకటే మార్గం కాదని.. ఇతర అనేక మార్గాలు కూడా ఉన్నాయని తెలిపింది. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారి తీస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల జారీ నిలిపివేయాలని తీర్పు ఇచ్చింది. దీనిపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది.భారత్‌లో ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ ఆదా యంలో సగాని కిపైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇచ్చే విరాళాల ద్వారా సేకరించినట్లు గతంలో పలు సంస్థ లు రిపోర్ట్ ఇచ్చాయి. రాజకీ య పార్టీలు ‘స్వచ్ఛంద నిధులు’ను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూర్చు కుంటూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా… ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమ కూర్చుకోవడంలో ముందంజలో ఉన్నాయి. కాగా… తాజా తీర్పు రాజకీయ పార్టీలకు చెంపపె ట్టులాంటిది. పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని … సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.