24.2 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు షెడ్యూల్ రిలీజ్

         తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. పాడి కౌశిక్ రెడ్డి ,కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఈ రెండు స్థానాల ఉప ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల సంఘం సిద్దమయింది. ఒక్క ఎమ్మెల్సీ గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ కు 64 మంది , మిత్రపక్షం సీపీఐ కలుపుకుని 65మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు ఒక ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ రెండో ఎమ్మెల్సీ గెలవడానికి మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, ఎంఐ ఎం నుంచి మద్దతు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండో అభ్యర్థిని బరిలోకి నిలుపుదామా లేదా అన్న చర్చ కాంగ్రెస్‌లో నడుస్తుంది.

       అయితే రెండో స్థానానికి నామినేషన్ వేయిస్తే ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నారనే అపవాదు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే భయం హస్తం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. గతంలో ఉమ్మడి ఏపీలో బలం లేని సమయంలో కూడా క్రాస్ ఓటింగ్ ద్వారా తమ అభ్యర్థులను గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. అలాంటి స్ట్రాటజీ ఇప్పుడు అమలు చేస్తుందా ,లేక ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఒక అభ్యర్థిని నిలబెడుతుందా అనేది చూడాలి. అయితే సొంతంగా కాంగ్రెస్‌కు ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ ఆప్షన్ మాత్రమే ఉంది. దీని విషయంలో కూడా కాంగ్రెస్ అనేక ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో పాటు కాంగ్రెస్ నుంచి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే గాని ,ఎమ్మెల్సీ గాని లేరు. అందులో నూ రేపు క్యాబినెట్ విస్తరణ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మైనారిటీ నేతకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు మళ్లీ అవకాశం ఇవ్వొద్దనే నిర్ణయం కాంగ్రెస్ తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మస్కత్ అలీ, జాఫర్ జావిద్ పేర్లు చర్చలో ఉన్నాయి.

       ఇక గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన చూస్తే అద్దంకి దయాకర్ ,చిన్నారెడ్డి, బెల్లయ్య నాయక్‌తో పాటు , పార్టీకి పనిచేసిన వారి లిస్ట్ లో వేం నరేందర్ రెడ్డి ముందుంటారు. ఇవేకాక గవర్నర్ కొటా లో రెండు ఎమ్మెల్సీ లు ఖాలీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి భర్తీపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గవర్నర్ కోటా లో అందె శ్రీ , కోదండరాం పేర్లను కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమా చారం. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. రాజకీయాలలో యాక్టీవ్ గా ఉన్న వ్యక్తి ని గవర్నర్ కోటాలో నామి నేట్ చేయగా.. ఆ అభ్యర్థిని గవర్నర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందె శ్రీ తో పాటు, రాజకీయ పార్టీ అధ్యక్షు డు అయి నప్పటికీ తెలంగాణ ఉద్యమ నేతగా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ పేరు గవర్నర్ కు నామినేట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదని టీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఒక నేతకు, గవర్నర్ కోటా లో ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నారు. అయితే బలం లేకున్నా నాలుగో వ్యక్తిని పోటీలో పెడుతుందా అనేదే అసలు చర్చ.. మరి కాంగ్రెస్ వ్యూహం తెలియాలంటే మరో వారం ఆగాల్సిన పరిస్థితి ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్