ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఢిల్లీలో కనీస ఉష్ణోగ్రత 7.4 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో జనం వణికిపోతున్నా రు. ఉత్తరాదిన పొగమంచు కమ్మేసింది. చాలామంది ఇళ్లకే పరిమితమైతే. వాహనాల్లో ప్రయాణించేవారు దట్టమైన పొగ మంచు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కన్పించడం లేదు. పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు బయలు దేరే వేళలను మార్చారు.
చాలా ప్రాంతాల్లో చలిమంటలు వేసుకుని గడుపుతున్నారు.ఇక జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మంచుకురుస్తుండడం,స్వల్ప వర్షాలతో జనజీవనం స్తంభించింది.పంజా బ్, హర్యానా, యూపీలోనూ ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో జనం కటకటలాడుతున్నారు. బీహార్,రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోనూ చలిగాలుల విప రీతంగా వీస్తున్నాయి. పొగమంచు కుమ్మేస్తోంది. అటు త్రిపుర, ఇటు జమ్మూ కశ్మీర్ లోనూ చలి, పొగ మంచుతో ఇబ్బం దులు తప్పడంలేదు.