పార్లమెంటు ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటి నుంచే ప్రధాని మోదీతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలనే ఆలోచనలతో ఉంది.
ఈనెల చివరినాటికి తెలంగాణలో ప్రధాని మోదీ రెండుసార్లు పర్యటించేలా ప్లాన్ చేస్తోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో ప్రధాని మోదీ సభలు ఉండబోతున్నట్లు సమాచారం.. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవడంపై దృష్టి పెట్టిన కమలనాథులు.. బీజేపీ నేతల కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇవాళ రెండో రోజు కూడా నేతలు సమావేశం కానున్నారు.
ఇవాళ బీజేపీ కోర్ కమిటీ సమవేశం జరగనుంది. మధ్యాహ్నం పార్లమెంట్ పొలిటికల్ ఇంఛార్జిలు, ప్రభారీ, కన్వీనర్ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్లమెంట్ కమిటీ సభ్యులు, లక్ష్మణ్ , జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ , ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గోంటారు. రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ హాజరవుతారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. పార్లమెంట్ ఎన్నికల పై రోడ్ మ్యాప్ ను రూపొందించనున్నారు. ఈ నెలలో రెండు సార్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటనకు సంబంధించి ఎక్కడ సభలు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.