24.2 C
Hyderabad
Monday, November 3, 2025
spot_img

ఇదీ మన అభివృద్ధి ఆర్థిక భారతం

        మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి నూరేళ్లు నిండుతాయి. గత ఏడాదే స్వతంత్రభారత వజ్రోత్సవాలను సైతం ఘనంగా జరుపుకున్నాం. అభివృద్ధి చెందిన ప్రంపంచ దేశాల వరుసలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది? అని ప్రశ్నించుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం చూస్తే 192 దేశాల్లో మన దేశం 132వ స్థానంలో ఉంది. స్వాతంత్య్రానంతరం మనదేశం అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా దిగుమతులపైనే ఆధారపడాల్సివస్తోంది. మనకంటే ఏడాది తర్వాత బ్రిటీష్ పాలన నుండి విముక్తి పొందిన చైనా మాత్రం ఆర్థిక వాణిజ్య రంగాల్లో శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తుంది. ప్రతీ క్షణాన్ని ప్రపంచ విపణిలో ఆధిపత్యం కోసం సరికొత్త వ్యూహాలను అమలు చేస్తుంది. సరిహద్దు దేశాల నుంచి ఆసియా ఖండంలోని ప్రతి దేశంపై పట్టు సాధించేందుకు విశేషంగా కృషి చేస్తుంది. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యమైన అమెరికాతోనే పోటీ పడుతోంది.తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటుంది. ఈ నేపథ్యంలో మన దేశ నేతలు మరికొంత కాలంలోనే చైనాను అధిగమిస్తామని ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే అంటున్నారు ఆర్థిక వేత్తలు. ఉత్పత్తి రంగాల్లో వెనకబడిన మన దేశం ఏ రకంగా చైనా లాంటి దేశాలతో పోటీ పడగలుగుతుందని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

       తయారీ రంగంలో దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన సాధనకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికైతే సఫలీకృతం కాలేదు. మరి ఎప్పటికి అవుతుందో నిర్ధిష్టమైన తేదీలు లేవు. మేక్ ఇన్ ఇండియా నినాదం కేవలం నినా దం వరకే పరిమితం అయ్యింది. వాస్తవ అంశాలను పరిశీలిస్తే ఇప్పటికీ చైనా, దక్షిణ కొరియా, అమోరికా ,జపాన్ వంటి పలు దేశాల నుంచి ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ యంత్రాలను దిగుమతి చేసుకునే స్థితిలోనే దేశం ఉంది. అంతేకాదు యంత్రాలు, ఔషధ రంగాల్లోముడిసరుకులు , మందులు తయారీకి వాడే పరికరాలు దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. కనీసం 2047 నాటికన్నా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందా అనే ప్రశ్నలకు ఏ సమాధానం దొరకదు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ముఖ్యంగా వాణిజ్యం, సేద్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలలో అద్భుత ప్రగతి ఇంకా సాధించించవల్సి ఉంది. మన ప్రభుత్వాలు, పాలకులకు దార్శనిక దృక్పధంతో ఆర్ధిక, సామాజిక అభివృద్ధి. పర్యావరణ సుస్థిరత, సమ్మిళిత సుపరిపాలన అందించడంలో ఇంకా వెనకబడి ఉన్నామనేది స్పష్టంగా తెలుస్తోంది.

      దేశ ప్రజల్లో ముఖ్యంగా మహిళలు, బాలబాలికలు ఇప్పటికీ పోషకాహార లోపం, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య , ఆరోగ్య సంరక్షణను కల్పించడంలో వెనకబడి ఉన్నామనేది స్పష్టంగా గణాంకాలు తెప్తున్నాయి. మహిళలు, యువత, రైతుల అభ్యున్నతే లక్ష్యమని ప్రధాని మోదీ తరచూ చెప్తున్నప్పటికీ ఆ పరిస్థితులు నిజంగా ఉన్నాయా అనేది లక్ష డాలర్ల ప్రశ్నగా మిగిలింది. మోదీ పదేళ్ల పాలనలో దేశంలో 25 కోట్లమంది దారిద్య్రరేఖను అధిగమించారని మోదీ చెప్పారు. మోదీ చెప్పిన మాటలను సమర్థిస్తూ నీతి ఆయోగ్ 24.82 కోట్లమంది అధికమించారని ప్రకటించింది. జాతీయ బహువిధ దారిద్య్ర సూచిక, ఎన్ఎంపీఐ ఆధారంగా ఈ గణన జరిగింది.

      యూఎన్డీపీ దారిద్య్ర్యగణనలో ప్రజారోగ్యం, పౌష్టికాహారం, శిశు మరణాలు, విద్య, పాఠశాలలో ఎన్నేళ్లు చదివారు. విద్యార్థుల హాజరు ఎలా ఉంది. వంటగ్యాస్, పారిశుద్ధ్యం, మంచినీరు, గృహవసతి, ఆస్తులు వంటి జీవన ప్రమాణాల ఆధారంగా దారిద్య్ర రేఖను నిజంగా దాటారా లేదా అనేది పరిశీలించి నిర్ధారిస్తారు. నీతి ఆయోగ్ బహుముఖ దారిద్య్ర్య సూచికల ఎన్ఎంపీఐ మేరకు తల్లుల ఆరోగ్యం, వారికి బ్యాంకు ఖాతాలున్నాయా అనే రెండు అంశాలను చేర్చి, 12 అంశాల ప్రాతిపదికగా గణించినట్టు చెప్పారు. సంప్రదాయకంగా గృహస్తుల ఆదాయం, వినియోగం ప్రాతిపదికగా జరిగే దారిద్య్ర్య గణనకంటే ఎన్ఎంపీఐ పద్ధతి మెరుగైనదని నీతి అయోగ్ భావిస్తోంది. థామ్సన్ రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన స్వచ్ఛంద సంస్థ థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్. 2011 నాటి సర్వేలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ఐదు దేశాలను ఈ సంస్థ ప్రకటించింది. అందులో అఫ్ఘానిస్తాన్, కాంగో, పాకిస్తాన్‌లు మొదటి మూడు స్థానాల్లో ఉండగా..మన దేశం నాలుగో స్థానంలో ఉంది.

        దేశ వ్యాప్తంగా నాణ్యత లేని విద్య కారణంగా నిరుద్యోగ వ్యవస్థ నానాటికి పెరిగిపోతుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైనా, అమెరికా, జపాన్, ఇజ్రాయెల్ వంటి ఎన్నో దేశాలు అభివృద్ధిని సాధించాయి. కానీ మనం మాత్రం దశాబ్దాలుగా పాత సిలబస్ పాఠాలనే చెప్తూ విద్యార్థులను భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుంది. దీంతో నిరుద్యోగ సంఖ్య పెరుగుతుందే తప్ప ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో అల్పాదాయ వర్గాలకు బతుకే కష్టమైంది. అలాంటప్పుడు పొదుపు చేయగల మిగులు ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది. బ్యాంకుల్లో మహిళలకు ఖాతాల ఏర్పాటు చేసి ఏం ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయాన్ని నేతలు ప్రజలు ఆలోచించడం లేదా? అంతేకాదు విద్య, ఆరోగ్యం, వంటగ్యాస్ వంటి సౌకర్యాల కల్పన ద్వారా అమలుచేసే అభివృద్ధి వల్ల ప్రజల ఆదాయాలు, జీవన నాణ్యతలు మెరుగు పడతాయా అనేది మరో ప్రశ్న పుట్టుకొస్తోంది. ప్రజల ఆదాయ స్థాయిలను బట్టి దారిద్య్ర స్థాయిని లెక్కించే పద్ధతి బదులు దారిద్య్రరేఖను అధిగమించిన వారి సంఖ్యను ఎక్కువచేసి చూపడానికే ప్రభుత్వం ఎంపీఐ పద్ధతిని తీసుకొచ్చిందని విమర్శలు జాతీయ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.

        వాస్తవానికి దేశంలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్య తీరినపుడే దేశం అభివృద్ధి సాధ్యమవుతుంది. జీవన నాణ్యతలు మెరుగుపడినపుడే అంతర్జాతీయ స్థాయిలో మన యువత పోటీలో నిలిచి అందరికన్నా మిన్నగా ప్రతిభా సామర్ధ్యాలను ప్రదర్శించినప్పుడు, ప్రజల నిజ ఆదాయాలు పెరిగినపుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగ లుగుతుంది. భారత్ లో ఇప్పటి ఇప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన దుర్భర జీవితం గడుపుతున్న వారి సంఖ్య 16కోట్ల వరకు ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనా. 2017 నాటికి దేశంలో తలసరి ఆదాయం 2.15 డాలర్లు కొనుగోలుశక్తి ఉన్నవారిని ప్రాతిపదికగా తీసుకుని ప్రపంచ బ్యాంకు ఈ నిర్ధారణకు వచ్చింది. అత్యధికులు పల్లెల్లో ఉంటూ సేద్యం, వ్యవసాయేతర పనుల ద్వారా కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. మన దేశంలో 1951 నాటికి దాదాపు 70శాతం మంది వ్యవసాయరంగంపై ఆధారపడి జీవించేవారు. 2011 నాటికి వారి సంఖ్య 55 శాతానికి తగ్గినట్లు గణాంకాలు ఘోషిస్తు న్నాయి. అయితే సేద్యం పై ఆధారపడి బతికే వారి సంఖ్య 2019నాటికి 42,5శాతానికి తగ్గింది. 2019-20లలో దేశంలో కరోనా ప్రబలి లాక్ డౌన్లు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల మూసివేత వల్ల నగరాలు, పట్టణాలలో పనిచేస్తున్న లక్షలాది వలస కార్మికులు మండుటెండల్లో కాలినడకన పల్లెబాట పట్టారు. ఆ సంక్లిష్ట సమయంలో వారికి పని కల్పించి పొట్టపోసుకోవడానికి ఆస్కారమిచ్చి నీడ కల్పించింది. ఈ సంవత్సరాలలో మళ్లీ సేద్యపు రంగంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య 2019లో 45.6 శాతానికి, 2020లో 46.5 శాతానికి పెరిగింది. 2021లో వారి సంఖ్య 45.5శాతానికి తగ్గింది. గతంలో దేశాన్ని పాలించిన యూపీఏ, ఇప్పుడు పాలిస్తున్న ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో పేదల స్థితిగుతులు ఇలా ఉన్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్