తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి కి కటీఫ్ చెప్పా రు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో ఒంటరిగానే మొత్తం 42 స్థానాలకూ పోటీ చేయనున్నట్లు ప్రకటిం చారు. తమ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బీజేపీని చిత్తు చేయగలదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కూట మి లో కమ్యూనిస్ట్ పార్టీల ఉనికి పట్ల మొదటి నుంచీ వ్యతిరేకతతో ఉన్న మమతా బెనర్జీ, గతంలో కాంగ్రెస్ కు కేవలం 2 సీట్లు ఇస్తామని ప్రకటించారు. ఇండియా కూటమి సమావేశాలనూ పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ తో చర్చించే ప్రసక్తి లేదని మమత స్పష్టం చేశారు. బెంగాల్‌లో తామే అన్ని స్థానాలకూ ఒంటరిగా పోటీ చేసి బీజేపీని చిత్తు చేస్తామని స్పష్టం చేశారు. తాము ఇండియా కూటమిలో ఉన్నామని, రాహుల్ న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్ లోనూ సాగాల్సి ఉన్నా.. తమకు కనీసం సమాచారం కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి తానే పేరు పెట్టినా.. కూటమిని సీపీఎం కంట్రోల్ చేయడాన్ని సహించలేక పోతున్నామన్నారు.