24.3 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

ఆసియా ఖండంలో భారత్ – చైనా విదేశాంగ విధానాలు

         డ్రాగన్ దేశం పెట్టుబడుల్ని, ఆర్థిక ఒప్పందాలను ఆసరా చేసుకుని ఇతర దేశాలపై పెత్తనం చలాయిస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక అన్నమో రామచంద్రా అంటూ అలమటించే దశకు చేరింది. అదే క్రమంలో దౌత్య ఒప్పందాలను గాలికొదిలి మన దేశ సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వింది. చైనా స్వభావానికి కళ్లెం వేయడంలో జియో ఎకనామిక్స్ కీలకమని మోదీకి బాగా తెలుసు. చైనాకు అతి పెద్ద భారతీయ మార్కెట్ అవసరమని మోదీ గుర్తించారు. విదేశాంగ విధాననాల్లో భాగంగా ఒప్పందాలకు విఘాతంగా కలగకుండా కీలెరిగి వాతపెట్టే విధానాలను మోదీ అమలు చేశారు. రవాణా, వాణిజ్య విధానాల్లో భద్రతా చర్యల పేరిట కట్టుదిట్టం చేసి చైనాకు ముక్కుతాడు వేశారు. ఆసియా ఖండంలో చైనా తీరు అదును కోసం చూస్తున్న గుంట నక్కలా మారింది.

      గత 73ఏళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే, చైనా-భారత్ సంబంధాలు గాలి, వానల మధ్య ఉన్న అనుబంధంలా ముందుకు సాగింది. ఏప్రిల్ 1, 2023 నాటికి భారతదేశం, చైనా దౌత్య సంబంధాలకు 73 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాలు అభివృద్ధి బాటలో పయనించాయి. 1950లలో, రెండు దేశాల పాత తరం నాయకులు చైనా, భారతదేశం మధ్య దౌత్య సంబంధాలను నెలకొల్పడానికి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. శాంతియుతమైన దౌత్య సంబంధాలు కొనసాగించడానికి ఇరు దేశాల మధ్య ఐదు సూత్రాల ఒప్పందాన్ని కుదుర్చకున్నారు.1980 నాటి నుండి శాంతియుత, స్నేహపూర్వక సంప్రదింపుల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. “హిందీ చినీ భాయ్ భాయ్” అనే నినాదంతో ముందుకుసాగాయి. గతంలో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను గాలికి వదిలి…1962లో, సరిహద్దు వివాదంతో యుద్ధానికి తెగబడింది. 1976 తర్వాత చైనా, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా మెరుగుపడ్డాయి.ఇప్పటికీ చైనా భారత్ ల మధ్య సుమారు 25 సరిహద్దు వివాదాలు ఉన్నాయి.ఈ వివాదాలు తేలాలంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తప్పదనేది అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పటికే గాల్వాన్ , అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో అడపాదడపా సైనిక చర్యలకు పాల్పడుతూ గలాటా చేస్తూనే ఉంది.చైనా-భారత్ సంబంధాలు సయోధ్యగా ముందుకు నడవాలంటే జియోఎకనామిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మోదీకి బాగా తెలుసు.అందుకే మోదీ దేశీయ పరిశ్రమలను పోటీ నుండి రక్షించడానికి ఉక్కు, రసాయనాలు, సోలార్ ప్యానెల్స్ వంటి అనేక చైనీస్ ఉత్పత్తులపై యాంటీ-డంపింగ్ సుంకాలు విధించారు. జాతీయ భద్రత, డేటా గోప్యతా సమస్యలను ఉటంకిస్తూ టెలికాం, డిజిటల్, మీడియా వంటి రంగాలలో చైనీస్ యాప్‌లు, పెట్టుబడులను మోదీ ప్రభుత్వం నిషేధించింది.అక్కడ కొడితే ఇక్కడ కొడతామన్నట్టు టిట్ ఫర్ టాట్ సిద్దాంతానికి మోదీ ప్రభుత్వం తెరతీసి, టైట్ ఫర్ టాట్ తో ముగించింది. మాటిమాటికి భారత్ తో లొల్లిపెట్టుకుంటే ఆర్థికంగా దెబ్బతింటామనే భయాన్ని డ్రాగన్ దేశానికి కలిగించడంలో మోదీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. ఈ దెబ్బతో డ్రాగన్ కొంతమేర దూకుడు తగ్గించినా చైనా గుంట నక్క వ్యవహారం ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు విశ్లేషకులు.

         మోదీ ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వుహాన్ , చెన్నైలలో వరుసగా రెండు అనధికారిక శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించారు. ప్రపంచ , ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన విస్తృతమైన, దీర్ఘకాలిక సమస్యలపై సమాలోచనలు చేశారు.ఇరు దేశాల అభివృద్ధి నేపథ్యంగా సన్నిహిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించారు. సెప్టెంబర్ 15,2022 నాటికి, 8.75 బిలియన్ల డాలర్ల ఫైనాన్సింగ్ కోసం 33 ప్రాజెక్ట్‌లు ఆమోదం పొందాయి. బ్రిక్స్ కి చెందిన ఎన్డీబీ బ్యాంక్ షాంఘైలో తన కార్యాలయాన్ని స్థాపించింది.ఈ బ్యాంక్ జూన్ 2022లో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో భారతదేశ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఎన్డీబీలో భారతదేశం అతిపెద్ద రుణగ్రహీతగా 19 ప్రాజెక్ట్‌లకు గానూ 6.92 బిలియన్ల డాలర్లను రుణంగా తీసుకుంది.ఆగస్టు 31,2022న. జూలై 18,2023న గాంధీనగర్‌లో జరిగిన మూడవ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత్ – చైనాల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది.

       గత దశాబ్ద కాలంలో భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది. భారత్-చైనా వాణిజ్యం 2022లో 115.42 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో వరుసగా రెండో ఏడాది కూడా 100 బిలియన్ డాలర్లు దాటింది.గత కొన్ని సంవత్సరాలలో పెరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యంతో, అనేక భారతీయ కంపెనీలు చైనాలో తమ భారతీయ, ఎంఎన్సీ ఖాతాదారులకు సేవలందించేందుకు చైనా కార్యకలాపాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఇది కాకుండా, వందకుపైగా చైనీస్ కంపెనీలు భారతదేశంలో కార్యాలయాలు స్థాపించాయి. మెషినరీ ,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ రంగంలో చైనాదే పెద్ద మార్కెట్. 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 4,459 వస్తువులను చైనాకు ఎగుమతి చేసింది. 2023 ఆర్థక సంవత్సరంలో చైనాకు భారతదేశం చేసిన ఎగుమతులు విలువ 15.33 బిలియన్లు డాలర్లు ఉంటుందని అంచనా. 2022 ఆర్థిక సంవత్సరంలో 21.26 బిలియన్ డాలర్లు దాటింది.

        భారత్, చైనాల మధ్య మొత్తం వాణిజ్యం గత ఐదేళ్లలో 29% పెరిగి 2017-18 ఆర్థిక సంవత్సరంలో 89.72 బిలియన్ల డాలర్ల నుండి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 115 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2022-23 నాటికి, చైనా భారత్ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. మొత్తానికి మోదీ నిర్ణయాలు చైనాను నిలువరించడానికి దోహదపడ్డాయి. 370 ఆర్టికల్ రద్దుతో కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించినట్టే భవిష్యత్తులో వ్యూహాత్మకంగా చైనా భారత్ సరిహద్దు సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. భారత్ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పర్యటన సందర్భంగా భారత్ – ఫ్రాన్స్ ల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల అభివృద్ధితోపాటు సైనిక అవసరాలకు సాంకేతిక సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. మొత్తానికి మోదీ మెక్రాన్‌ చర్చలు డ్రాగన్ కలవరపెడుతోంది. చైనా-ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టపరుచుకోవాలని కోరడం వెనక డ్రాగన్ కంటగింపు స్పష్టంగా బయటపడింది.

     తైవాన్ ను ఆక్రమించునేందుకు డ్రాగన్ చేయని కుతంత్ర లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ద్వీపం తమ దేశంలోదేనని వాదిస్తున్న చైనా తమ భూభాగంలో విలీనం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. తాజాగా తైవాన్ కు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్త యువాంగ్ లియూ పేరు సైతం పద్మభూషణ్ అవార్డుల జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో భారత్ తైవాన్ పక్షమేననిచైనాకు చెప్పకనే చెప్పింది. పదేళ్ల ఎన్డీఏ పాలనలో విదేశాంగ విధానాలతో దేశ పురోభివృద్ధికి మోది సరికొత్త బాటలు వేశారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యానంతరం శర వేగంగా భారత్ ప్రపంచ అగ్రదేశాల దృష్టిని ఆకర్షించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్