తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి కృష్ణానీళ్ళ సుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందే నీటి పంపకాల పంచాయితీ కాడ, రాష్ట్ర ఏర్పాటు అనంతరం నీళ్లు కూడా కార్చిచ్చులా మండుతున్నాయి. సాధించుకున్న స్వరాష్ట్రంలో సైతం తెలంగాణ కృష్ణా జలాలు ఎందుకు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు? రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నదిలో తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించుకునేందుకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వహించారా…? దక్షిణ తెలంగాణ భూములు బీళ్లుగా మారడానికి కారణం ఎవరు…? కృష్ణాజలాల విషయంలో తెలంగాణ ఇంకా నష్టపోతూనే ఉందా…? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.
తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్ళు, నిధులు, నియామకాలపై సాగింది. తెలంగాణ వచ్చాక కూడా నీటి వాటాలు పొందకుండా..అంతే స్థాయిలో నష్టపోయింది. అయితే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకీ అప్పగిస్తు న్నారు అని వచ్చిన వార్తలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు రాకుండా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి జేస్తే.. కాంగ్రెస్ కు పేరొస్తుందిని,కేసీఆర్ సీఎం అయ్యాక నిర్లక్ష్యంతో సగం పూర్తైన ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి.. లక్ష కోట్లు ఖర్చువెట్టి కాళేశ్వరం కడితే.. నీళ్ళు రాకపాయే, అప్పులు ఎక్కువాయే మూడు ఏండ్లుగాక ముందే ప్రాజెక్టుకు పగుళ్లు వచ్చే ఏం పాయిదా అయ్యింది అని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను గట్టిగానే విమర్శిస్తుంది.
మరో వైపు తెలంగాణ హక్కుగా రావాల్సిన నీళ్ళు.. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ భాధ్యతలు పూర్తిగా కేఆర్‍ఎంబీకీ అప్పగించడం కోసం ఒప్పందల మీద కేసీఆర్ ప్రభుత్వం సంతకలు చేసింది అని కాంగ్రెస్ అంటే.. ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసింది కేసీఆరే, నీటి వాటా యాభై శాతం కేటాయించే వరకు.. కేఆర్‍ఎంబీకీ ఎట్టిపరిస్థితుల్లో అప్పగించేది లేదు అని అపెక్స్ కౌన్సిల్ కి లేఖ రాసినం అని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి చెబుతు న్నాడు. అంతేకాదు ప్రాజెక్టుల భాద్యతలు కేఆర్‍ఎంబీకీ అప్పజెప్పడం మీద కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ ప్రజల కు చెప్పకుండ సప్పుడు జెయ్యకుండా ఉంటున్నారు అని ప్రతిపక్ష బీఆర్‍ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ ను రాజే స్తున్నారు. అయితే ఇదే ముచ్చట మీద కేసీఆర్ పార్టీ లీడర్లు…కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడు వచ్చుడే నీళ్ళ పంపకాలల్ల నష్టం చేసిన్రు… అని రాజకీయ లడాయికి దిగుతున్నారు గులాబి పార్టోళ్ళు. ఇగ ఇట్ల ఊకుంటే మొదటికే మమోసం వస్తదని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఎనుకటి కాగితాలు తీసి,ఏ రోజు ఏం జేసిర్రు అనే లెక్కలన్ని ముంగటేశిండు. పోతిరెడ్డి పాడుకు పోక్క పెద్దగా జేస్సున్నప్పుడు వైఎస్ కాబినెట్‍లో హరిష్ రావు మంత్రిగా ఉండే.. రాష్ట్రం వచ్చినంక ప్రగతి భవన్ ల ఆంధ్రరాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి తోని అప్పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విందు భోజనాలు చేసిండు.. అరవై నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరిపిండ్రు కాంట్రాక్టులు కావాల్సినోళ్ళకు కట్టబెట్టీండ్రు. కాని నీళ్ళ పంచాయితీలు తెల్చలేదు.. కృష్ణానది మీద జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకోలేదు.. కేసులు పెట్టలేదు.. ఆంధ్ర ప్రాజెక్టుల టెండర్లు పూర్తి అయ్యేదాక బోర్డు మీటీంగ్లకు పోవడానికి కేసీఆర్ కు తీరికలేదు అని కేంద్రానికి లేఖలు రాశిండు అనుకొచ్చిండు సీఎం రెవంత్ రెడ్ది.
సీఎం రెవంత్ రెడ్డి పట్టపగలు, మిట్ట మధ్యహ్నం ప్రగతి భవన్‍లో కూసోని చెప్పరాని అబద్దాలు అవలీలాగా చెప్పుకొ చ్చిండు. .. అని మాజీ మంత్రి హరిష్ రావు అనుకొచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి సూపిచ్చిన ఫైళ్ళు నేను సదివి ఇనిపిస్తా ఆటి అర్ధం అట్ల లేదు.. మేము ఆంధ్ర,తెలంగాణ కు నీటీ వాటాలు 50శాతం పంచాలే అని పట్టుబట్టినం. పంచాది తశ్వ అయ్యెదాక ప్రాజెక్టులను అప్పజేప్పుడు లేనే లేదు అన్నం… కాంగ్రెసొళ్ళు అన్ని జూట చెబుతున్నారు అని హరిశ్ రావు అనుకొచ్చిండు. ఏది ఏమైనా తెలంగాణ వచ్చి పదేండ్లు అయిన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిగాక తెలంగాణ నష్టపోయింది. ఇప్పటికైనా ప్రాజెక్టులు పూర్తిజేశే అపోశన చెయ్యిండ్రి సారు. రాజకీయ విమర్శలు, పార్టీలు పక్కన పెట్టి తెలంగాణకు అన్యాయం గాకుంట ఉంకోసారి అందరూ కలసి కొట్లాడుండ్రి అంటున్నరు తెలంగాణ ప్రజలు.