తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభంకానున్నాయి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌండ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతుల ను స్పీకర్‌కు అందజేశారు. ఇప్పటికే అసెంబ్లీ కమిటీ హాల్‌లో భేటీ అయిన కేబినెట్.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్‌కు రూప కల్పన చేసింది సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 3 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ ఉండనుంది. సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదలకు అధిక నిధులు కేటాయింపులు, ఆరు గ్యారంటీలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ రూపొందించింది ప్రభు త్వం.బడ్జెట్ లో అన్ని అంశాలు ఉంటాయని భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తా మన్నారు. ఆస్తులు, అప్పులతో పాటు కేంద్రం నుండి వచ్చే ఆదాయంపైనా వివరాలు చెబుతామ న్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకావడం లేదు.