డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం పరిశీలించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం బ్యారేజ్‌ను రాష్ట్ర డ్యాం సెఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పరిశీలించింది. అనీల్ దేశాయి నేతృత్వంలో నిపుణుల బృందం అన్నారం బ్యారేజిలో సమస్యలను అడిగి తెలుసుకుంది. బ్యారేజ్ లోని 39 పిల్లర్ వద్ద ఏర్పడిన సీపేజిని పరీశీలించారు. అనంతరం బ్యారేజ్ పైన పిల్లర్స్ ను పరిశీలించి ఇసుక మేటలను చూసారు.మరోవైపు NDSA ఇచ్చే నివేదికతోనే మరమ్మత్తులు చేయాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరమత్తుల కోసం అన్నారం బ్యారేజీలో ఇప్పటికే స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని NDSA సూచించిన క్రమంలో రాత్రికి రాత్రే గేట్లు తెరిచి నీటిని పూర్తిగా విడుదల చేశారు అధికారులు. బ్యారేజీలో నిలువ ఉన్న మొత్తం 2.5 టీఎం సీల నీటిని కిందికి వదిలారు. ఇక అన్నారం నీళ్లు వదలడంతో మేడిగడ్డ దగ్గర పనులు ఆగిపోయాయి.


