హైదరాబాదులో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బొల్లారంలో ఓ డాక్టర్.. కారును నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి తోపుడుబండ్ల మీదకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో సయ్యద్ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కారును వెంబడించిన స్థానికులు.. ఎట్టకేలకు డాక్టర్‌ను పట్టుకున్నారు. డాక్టర్‌ను ప్రముఖ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ గా పనిచే స్తున్న కార్తిక్ ఎల్లంకిగా గుర్తించారు. అయితే తన సొంత ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయిస్తానని పాషా ను తీసుకెళ్లాడు. అత్తాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పాషాను ఉంచి డాక్టర్ కార్తీక్ అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రస్తుతం పాషా పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రి బిల్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాని కుటుంబ సభ్యులు అంటున్నారు. స్థాని కులు డాక్టర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే వదిలేసారని ఆరోపిస్తున్నారు.