గడిచిన తొమ్మిది ఏళ్లలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి మీద ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..అప్పట్లో.. అనుమానాలు, విమర్శలు చేసిన హరిత హారం కార్యక్రమం మీద మాత్రం సైలెంట్‌గా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ సీఎం కేసిఆర్ ప్రారంభించిన హరిత హారం మీద ప్రజా ధనం వృధా , పర్యవేక్షణలో నిర్లక్ష్యం లాంటి విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రస్తుతం ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే ఈ ఏడాది కొత్త మొక్కలు నాటేందుకు సిద్దమైంది. అయితే అసలు మొక్కలు నాటడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు జరిగాయా అన్న అనుమానలు అప్పట్లో పర్యావరణ వేత్తలతో పాటు ప్రజల్లో కూడా కలిగాయి. ఇంతకీ అసలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన హరిత హారం ద్వారా రాష్ట్రంలో పెరిగిన పచ్చదనం ఎంత..? అన్నిటి మీద ఎంక్వైరీలు మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం హరితహారం మీద ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది..?


