22.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

హద్దులు దాటిన టీచర్ – ముద్దిరిన విద్యార్థి

కాలం మారిందని కాలం మీద నిందవేసి, మనం ఏం చేసినా చెల్లుబాటవుతుందనే కాలం నుడుస్తోంది. ఈ రోజుల్లో చిన్నా పెద్దా , గురువు దైవం అనే మర్యాదలు మచ్చకు కూడా కనిపించడం లేదు. ఈ కాలం పిల్లలే పెద్దలను గౌరవిం చడం లేదని బాధ ఒకవైపు… ఇంకొంత మంది పెద్దలు వారి స్థాయినే మరిచి దిగజారుతున్న పరిస్థితి. అలాంటి సంఘ టనే విద్యార్థితో టీచర్ ముద్దులాట…

పేరుకేమో ఫొటోషూట్ సీన్ అందుకు భిన్నంగా ఉంది. ఫొటో షూట్‌లో హద్దులు దాటిన టీచర్ విద్యార్థిని ముద్దు పెట్టుకుని మరీ హల్ చల్ చేసింది. కాలం మారిందని కాలం మీద నిందవేసి, మనం ఏం చేసినా చెల్లుబాటవుతుందనే కాలం నుడుస్తోంది. ఈ రోజుల్లో చిన్నా పెద్దా, గురువు దైవం అనే మర్యాదలు మచ్చకు కూడా కనిపించడం లేదు. ఈ కాలం పిల్లలే పెద్దలను గౌరవించడం లేదని బాధ ఒకవైపు… ఇంకొంత మంది పెద్దలు వారి స్థాయినే మరిచి దిగజారుతున్న పరిస్థితి. అలాంటి సంఘటనే విద్యార్థితో టీచర్ ముద్దులాట.. పిల్లలకు విద్యాబుద్దులు చెప్పి వారిని సరైన దారిలో నడిపించే గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న కొందరు టీచర్లు తప్పు దారి పడుతున్నారు. ఏకంగా విద్యార్థులతో కలిసి రాసలీలలు సాగిస్తున్నారు. ఇటీవల ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. విద్య నేర్పే ఒక టీచర్ తన స్టూడెంట్‌తో కలిసి హద్దులు దాటి ప్రవర్తించింది. పేరుకు ఫొటో షూట్ ..కానీ వాళ్లు నిర్వాకం మాత్రం రోమాన్స్ షూట్ అన్నట్టు ఉంది. దీంతో నెట్టింట ఆ వీడియో చూసి నెటిజన్లు తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నారు …ఇదేం మాయరోగమని …

కర్ణాటకలోని మురుగమల్ల చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి టీచర్లు పర్యాటక ప్రదేశాలకు వెళ్లారు.ఆ పర్యాటక ప్రదేశాల గురించి విద్యార్థులకు వివిరించి, మంచి అవగాహన కల్పించాల్సిది పోయి ఒక టీచర్ అందుకు భిన్నంగా ప్రవర్తించింది. ఒక టీచర్ ఫొటో షూట్ పేరుతో పదో తరగతి విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించింది. ఒక పర్యాటక ప్రదేశంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ పదో తరగతి విద్యార్థితో టీచర్ ఫొటోలు దిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ విద్యార్థి టీచర్‌ను ప్రియురాలిని ఎత్తినట్టు పైకి ఎత్తాడు. అక్కడితో ఆగకుండా వధూవరుల తరహాలో డిఫరెంట్  స్టైల్ లో లో ఫొటోలకు ఫోజు పెట్టారు. ఆ విద్యార్థి టీచర్ కు పువ్వు అందించి ముద్దు పెట్టే సీన్ పండించాడు. ‘ఇది తప్పురా నాయనా’ అని చెప్పాల్సిన టీచర్ అతడిని ముద్దు పెట్టుకుని మురిసింది. ఈ వీడియో చూసిన నెటిజన్‌లు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని సమాచారం.

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్