30.2 C
Hyderabad
Friday, March 1, 2024
spot_img

సైబర్ నేరగాళ్లతో …తస్మాత్ జాగ్రత్త

     ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి మహిళను బురిడీ కొట్టించిందో గ్యాంగ్ కట్ చేస్తే తీగ లాగితే డొంక మొత్తం విదేశాల నుంచి హవాలా రూపంలో ఇండియాలో జరుగుతున్నట్లుగా గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు

గత ఏడాది నవంబర్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు హైదరాబాద్ లోని ఓ మహిళ నుంచి ఫిర్యాదు అందింది UNITY STOCKS అనే కంపెనీలో 100% లాభం ఉంటుందని ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మరో స్టాక్ మార్కెట్‌లో డిపాజిట్ చేస్తే మరింత లాభం వస్తుందని Dafabet, Unity Exchange, T20 IPL మొదలైన గేమింగ్ వెబ్‌సైట్‌లలో నిందితులు అందించిన బ్యాంకు ఖాతాలలోకి నగదు ఇన్వెస్ట్ చేసింది బాధితురాలు.ఇలా ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో దుబాయ్ నుండి ఓ వ్యక్తి బాధితురాలికి కాంటాక్ట్ లోకి రావడం ఈ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితురాలు సైబర్ నేరగాళ్లు చెప్పింది తూచా తప్పకుండా పాటించింది.

      స్వయం తిమానియా అర్జున్‌తో కలిసి బ్రిజేష్ పటేల్ సహాయంతో హర్ష్ పాండ్యా కు ఫినో బ్యాంక్‌లో క్యాష్ డిపాజిట్ చేస్తారు.మేనేజ్‌మెంట్ సర్వీసెస్ నడుపుతున్న గాంధీ నగర్ వారు అతని ఖాతాలకు డబ్బు పంపుతారు.ఆ డబ్బును లిక్విడ్ క్యాష్ రూపంలో తమ వారికి డెలివరీ చేస్తారు.ప్రధాన నిందితుడు హర్ష్ పాండ్యా ఖాతాల్లోకి నగదు మొత్తం బదిలీ చేసిన తర్వాత వారు అహ్మదాబాద్ గాంధీనగర్‌లో హవాలా ద్వారా తెలిసిన కొందరు వ్యక్తులకు నగదు లావాదేవీలు జరిపారు. ఇందులో పాల్గొన్న అర్జున్‌కు,శంకర్ లాల్ లను హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పీఎస్ ఏసీపీ ఆర్‌జీ శివ మారుతి అహ్మదాబాద్, గాంధీనగర్‌లో అరెస్ట్ చేశారునిందితుల దగ్గర నుంచి 8 లక్షల నగదు,ఒక ల్యాప్ టాప్,12 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

      బాధితురాలు అధిక లాభం ఎర చూపించడంతో సైబర్ ఫ్రాడ్స్ ను నమ్మి ఏకంగా ఆస్తులనే విక్రయించే స్థాయికి వెళ్ళిపోయింది. ఆస్తులు విక్రయించిన నగదు మొత్తం మూడు కోట్లు ఫ్రాడ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది.ఈ కేసులో గతంలో ఒకరిని అరెస్టు చేసాం తాజాగా మరో ఐదుగురిని అరెస్ట్ చేశాం.సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బులు దుబాయ్ కి పంపుతున్నట్లుగా గుర్తించాం. అక్కడి నుంచి హవాలా మార్గం ద్వారా తిరిగి ఇండియాకు ఈ డబ్బు చేరుతుంది. అహ్మదాబాద్ గాంధీనగర్ కు చెందిన కొందరు వ్యక్తులు హవాలా ద్వారా ఇతరుల ఖాతాల్లోకి ఈ నగదు జమా చేస్తారు.ఈ కేసులో పరారీలో ఉన్న వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటాం.ఈ కేసులో స్వయం అనే బీకాం విద్యార్థి ఉన్నాడు.సైబర్ క్రైమ్ చాలా లోతుగా ఫైనల్ ఎండ్ దాకా దర్యాప్తు చేస్తున్నాం ఎక్కువ లాభాలకు ఆశపడి ట్రేడింగ్ పేరిట మోసపోకండి .ఈ మధ్యకాలంలో ఫెడెక్స్ కొరియర్ పేరిట మోసాలు జరుగుతున్నాయి…కొరియర్ కంపెనీ నుండి కాల్ చేసి మీ పేరు మీద డ్రగ్స్ వచ్చాయి అని భయ పెడతారు .కొరియర్ పేరుతో నేరగాళ్లు కాల్ చేస్తే స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు..

Latest Articles

ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్ధి ఆత్మహత్య

     ఇంటర్మీడియట్ పరీక్షలపై విధించిన ఒక్క నిమిషం నిబంధన విద్యార్ధి ప్రాణాల్ని బలితీసుకుంది. నిమిషం ఆలస్యంతో పరీక్షలకు హాజరుకాలేక మనస్తాపం చెందిన శివకుమార్‌ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్