సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల బాలికల కళాశాలలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరేసుకొని అనుమానస్పద స్ధితిలో మృతి చెందింది. శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫేర్వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి….హస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రి మార్చురీలో వదిలేసి హాస్టల్ సిబ్బంది హడావుడిగా పారిపోయ్యరాని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ చనిపోయేంత బలమైన కారణం లేదని… తన బిడ్డను హాస్టల్ నిర్వాహకులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపించారు. వైష్ణవి మృతికి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.


