టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన ఫైబర్ నెట్ కేసు విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఈ కేసులో ముందస్తు బెయి ల్ ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. దాంతో చంద్రబాబు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈనేప థ్యంలో సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. సీజేఐకి ద్విసభ్య ధర్మాసనం విన్నవించింది. ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దీంతో.. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు.. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఈ రోజు చంద్రబాబు పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలాఎం త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. అయి తే, 17ఏపై స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది.


