ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు కూడా ఆయన బిజీబిజీగా గడపను న్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాలనికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. మధ్యా హ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను రేవంత్ రెడ్డి కలుస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇవ్వవలసిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన మరో 1800 కోట్లు విడుదల చేయాలని కోరనున్నారు. అనంతరం UPSC చైర్ పర్సన్‌ను కలవనున్నారు. TSPSC ప్రక్షాళనపై ‘UPSC’ విధివిధానాలను తెలుసుకోనున్నారు.
రాష్ట్రంలో TSPSCని ప్రక్షాళన చేసే ఉద్దేశ్యంతో UPSC తరహాలో కొత్తగా కమిటిని ఏర్పాటు చేసే ఆలోచనపై రేవంత్, ఉత్తమ్ లు చర్చించనున్నారు. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసిన రేవంత్.. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి.. తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్‌లను కేటాయించాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు విన్నవించారు. అంతుకుమందు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిని కలిసిన రేవంత్.. పలు విషయాలపై చర్చించారు.


