ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరోసారి తూర్పు దిశంగా క్రూజ్ క్షిపణులను ప్రయోగించినట్టు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. దీంతో ఉభయ కొరియాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. క్రూజ్ క్షిపణులు తమ దేశంలోని ప్రధాన సైనిక స్థావరం మీదుగా వెళ్లినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని యూఎస్ నిఘా విభాగం కూడా ధ్రువీకరించింది. ఇదిలా ఉంటే సియోల్ నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు ఉత్తరకొరియా కదలికలను గమనించేలా తమ రక్షణ విభాగం అమెరికాతో కలిసి పని చేస్తున్నట్లు సియోల్ తెలిపింది. అయితే ఇప్పటికీ ఎన్ని క్షిపణులు ప్రయోగించిందనే అంశంపై ప్యాంగ్ యాంగ్ ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
కేవలం వారం వ్యవధిలోనే రెండు సార్లు కవ్వింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. గత వారం కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం పుల్వాసన్ -3-31 అనే వ్యూహాత్మక క్రూజ్ క్షిపణిని ప్రయోగించింది.అయితే ఈ క్షిపణికి అణ్వాయుధ సామ ర్ధ్యం సైతం ఉందని ప్రకటించడం గమనార్హం. తమ సరిహద్దు దేశాల్లో అమెరికా , దక్షిణ కొరియా గత వారం ఉమ్మడి సైనిక విన్యాసాల నిర్వహించడాన్ని ప్యాంగాంగ్ వ్యతిరేకించింది. దీనికి ప్రతి చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చ రించింది. ఈ విషయయాన్ని దేశ మీడియా సంస్థ కేసీఎన్ఏ తెలియజేసింది. ఈ ప్రకటన వెలువడిని కాసేపటికే క్షిపణి ప్రయోగాలు చేసినట్లు తెలిపింది.