పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన “పెట్” ప్రాజెక్ట్ ను సాకారం చేశారు. 86 ఏళ్ల రతన్ టాటా జంతు ప్రేమికులు. గాయపడిన తన కుక్కకు అధునాతన వైద్యం కల్పిచాలన్న తపనతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. పెంపుడు జంతు వులకు ఆధునిక సౌకర్యాలతో ఆస్పత్రి నిర్మించాలన్న తన చిరకాల కోరిక సాకారమయ్యేటట్లు చూశారు. ముంబై, మహా లక్ష్మి లోని టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ మార్చినెలలో ఆస్పత్రి ప్రారంభం కానున్నది.తన “పెట్” ప్రాజెక్టు ప్రారంభం కానున్న సందర్భంగా 1945లో తాను, తన సోదరుడు జిమ్మీ పెంపుడు కుక్కతో తీసుకున్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. 165 కోట్ల రూపాయల ఖర్చుతో 2.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రిలో పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఇతర చిన్న జంతువులకు ఆధునిక చికిత్స లభిస్తుంది. భారతదేశంలోని కొన్ని 24×7 ఆసుపత్రులలో ఒకటిగా ఉంటుంది. జంతువుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో నాలుగు ఆపరేషన్ థియేట ర్లతో పాటు సర్జరీ యూనిట్ ఉంటుంది. ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం, ఎంఆర్ఐ, ఐసీయూ, యూజీసీ, 2 డి ఎకో వంటి సేవలు లభిస్తాయి.


