22.7 C
Hyderabad
Thursday, December 5, 2024
spot_img

శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయ రగడ

       శ్రీశైలం వైసీపీ పార్టీలో ఇద్దరు నేతలు మధ్య టికెట్ పోరు ప్రారంభమైంది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితోపాటు, వైసీపీకి చెందిన శేషారెడ్డి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి పిలిపించా రంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన శ్రీశైలంలోనే పర్యటిస్తున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం 2024 ఎన్నికల్లో తనకు ప్రాధాన్యత ఇస్తుందని నమ్మకంతో బుడ్డా శేషురెడ్డి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. రోజు రోజుకు ఇతర నేతల మధ్య ఉత్కంఠతగా మారిన శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ టికెట్ పై స్వతంత్ర ప్రత్యేక కథనం.

       నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. నియోజక వర్గాల పునర్విభజన కాకముందు ఆత్మ కూరు నియోజకవర్గంగా ఉండేది. పునర్విభజనలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంగా మారింది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థిపై పోటీ చేసి గెలిచారు. ప్రస్తుత ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి చుట్టూ కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. రాబోయే ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి స్థానంలో బుడ్డ శేషారెడ్డికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

           శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని విజయవాడకు పిలిపించారని ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఆయన శ్రీశైలంలోని నియోజకవర్గంలోనే ఉన్నారు. శిల్ప చక్రపాణి రెడ్డి వర్గీయులు సీఎం జగన్ వద్దకు వెళ్లి చక్రపాణి రెడ్డికి టికెట్ కేటాయించాలని కోరారు. తాజాగా తెరపైకి వచ్చిన బుడ్డా శేషారెడ్డికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళరెడ్డి మూడవ తనయుడే బుడ్డా శేషారెడ్డి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి స్వయాన తమ్ముడు గతంలో వెలుగోడు మండల అధ్యక్షుడుగా పనిచేసిన బుడ్డా శేషారెడ్డి తండ్రి రాజకీయ వారసుడిగా మొట్టమొదటిసారిగా గుర్తింపు పొందారు.శేషారెడ్డి పూర్వం ఆత్మకూరు నియోజకవర్గంలో బుడ్డా వెంగళరెడ్డి రాజకీయంగా నేటికీ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి శ్రీశైలం నియోజకవర్గం నుంచి బుడ్డా శేషారెడ్డి, కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాపరెడ్డి, టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈ త్రిముఖ పోటీల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డి గెలుపొందారు

        వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో బుడ్డా శేషారెడ్డి వైసీపీలోకి చేరి ఈనాటి వరకు పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారి ఎమ్మెల్యేగా గెలుపొందడం వెనక తమ్ముడు శేషారెడ్డి అన్నతో కలవడం వల్లనే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బుడ్డా కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బుడ్డా వెంగళ రెడ్డిని పీపుల్స్ వార్ నక్సలైట్లు కాల్చి చంపడం, దాని తర్వాత ఆయన పెద్ద కుమారుడు బుడ్డా సీతారామిరెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది 1999-2004 సంవత్సరంలో చివరిసారిగా జరిగింది. ఆ తర్వాత ఈ 20 సంవత్సరాల్లో టీడీపీ గెలిచిన ధాఖలాలే లేవు.

        బుడ్డా కుటుంబంలో రెండో కుమారుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2014 వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తర్వాత టీడీపీ ప్రభుత్వంలో చేరారు. ఇదిలా ఉంటే వైసీపీలో 2019లో బుడ్డా శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వకుండా శిల్పా చక్రపా ణి రెడ్డి చక్రం తిప్పి బీఫామ్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ . జగన్మోహన్ రెడ్డి హామీతో బుడ్డా శేషారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ రాకపోయినా, 2024 ఎన్నికల్లో శ్రీశైలం నుంచి వైసీపీ టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సానుకూ లంగా ఉన్నట్లు తెలుస్తోంది. శిల్పా చక్రపాణి రెడ్డిని పక్కనపెట్టి బుడ్డా శేషారెడ్డికే, ఈసారి శ్రీశైలం టికెట్ వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఆత్మకూరు ప్రాంతానికి వచ్చినప్పుడు బుడ్డా సొంత గ్రామం వేల్పనూరులో మూడు రోజులపాటు శేషారెడ్డి ఇంట్లో జగన్ బస చేశారు. ఆ రోజు ఆ గ్రామంలో సుంకల పరమేశ్వరి దేవస్థానంలో పూజలు చేసి బహిరంగంగా బుడ్డ శేషారెడ్డిని గెలిపించాలని ప్రజలందరూ ఆశీర్వదించాలని, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆత్మకూరు బహిరంగ సభలో బుడ్డా శేషారెడ్డిని శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు ఆశీర్వ దించాలని కూడా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో కోరారు. కానీ బుడ్డా శేషారెడ్డికి మాత్రం గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.

        ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరులు నాయకులు వైఎస్‌ఆర్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీశారని ఇంటలిజెన్స్ వర్గాలు ఐపాక్ సర్వేలు సీఎం వ్యక్తిగత సర్వేలు స్పష్టం చేయడం వల్లనే ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ శిల్పా చక్రపాణి రెడ్డిని తప్పిస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలో బుడ్డా శేషారెడ్డి రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఇటీవలే తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థాన్ని సొంత గ్రామం వేల్పనూరులో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అన్ని పార్టీల సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రస్తుత ప్రజా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు. ప్రత్యేకించి శ్రీశైలం నియోజకవర్గంలోని ఐదు మండలాలతోపాటు పూర్వపు నియోజకవర్గంలోని, గడివేముల, పాములపాడు, కొత్తపల్లి మండలాల నుంచి బుడ్డా వెంగల్ రెడ్డి అనుచ రులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నిశ్చితార్థానికి మాత్రం శేషారెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. ఏది ఏమైనాప్పటికీ శ్రీశైలం నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డికి రెండోసారి టికెట్టు దక్కుతుందనే ఆశాభావంతో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Latest Articles

సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త మద్యం విధానంపై తొలిసారి వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నడుపుతున్న బెల్టు షాపులు ఎత్తివేశారని అన్నారు. మొత్తం షాపులన్నింటినీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్