26.2 C
Hyderabad
Tuesday, February 10, 2026
spot_img

‘వ్యూహం’ సినిమా విడుదలపై ఉత్కంఠ

            రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం చిత్రంపై తెలంగాణ హైకోర్టులో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు… ఇవాళ వెలువరిచ నుంది.ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ నారా లోకేశ్ కోర్టుకు వెళ్లారు. దీంతో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత హైకోర్టును కోరారు.తమ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తే కనీసం తెలంగాణలో విడుదల చేయడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే వ్యూహం సినిమా నిర్మాత న్యాయవాది విజ్ఞప్తిపై నారా లోకేశ్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్