రాబోయే సాధారణ ఎన్నికలకుగాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్‌సీపీ నియ మించింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజ నల్ కో ఆర్డినేటర్‌గా విజయ సాయి రెడ్డి, ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు రీజనల్ కో ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డినియమితులయ్యారు.
ఎంపీ విజయసాయిరెడ్డి రీజినల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న జిల్లాల్లో నెల్లూరు, తిరుపతిలను ఆయన వద్ద నుంచి తీసేశారు. ఈ రెండు జిల్లాల బాధ్యతలను ఇప్పటికే ఒంగోలు జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అప్పగించారు. అనకాపల్లి టికెట్ కోల్పోయిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఇప్పుడు పార్టీ బాధ్యత అప్పగించారు. అదీ ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేలా ఉప ప్రాంతీ య సమన్వయకర్తగా నియమించారు. విజయవాడ సెంట్రల్ టికెట్ రాని ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. కర్నూలు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌గా ఉన్న ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డికి నంద్యాల జిల్లా బాధ్యత కూడా ఇచ్చారు. ఇప్పటివరకూ నంద్యాల జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన్ను రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇటీవలే నియమించారు. వైయస్‌ఆర్ జిల్లా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న కె.సురేష్‌బాబుకు ఇప్పుడు రాజంపేట పార్లమెంటరీ పరిధినీ అప్పగించారు.