వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనో సీనియర్ నేత… పార్టీలో నంబర్ టూ గా చెలామణి అయ్యారు. వైసీపీ ఎంపీ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ గా కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీలో అయన అంత పలుకుబడి వున్నా…. అ యన బంధువులు మాత్రం వైసీపీ కి గుడ్ బై చెప్పారు. జగన్ మోహన్ రెడ్డిని కాదని, చంద్రబాబు పక్షాన చేరారు. ఇదే విషయం ఇప్పుడు పార్టీలో ఆ ముఖ్య నేతకు తలనొప్పిగా మారింది.
ఎన్నికల వేళ మెరుపు వేగంతో రంగులు మార్చేస్తున్నారు కొందరు నాయకులు. రాజకీయ వలసలు ఊపందుకుం టున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి టీడీపీ లోకి వెళ్తున్నారు నేతలు. ఇప్పటికే సీఎం సొంత జిల్లా కడపకు చెందిన ఎమ్మెల్సీ సి. రామ చంద్రయ్య టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ సీనియర్ నేత దాడి వీర భద్రరావు కూడా టీడీపీ గూటికి చేరారు. వైసీపీలో అత్యంత కీలక నేతల్లో విజయసాయి రెడ్డి ఒకరు. అయన కు పార్టీలో నంబర్ టు అనే పేరు వుంది. వైసీపీ ఎంపీగా పార్టీ ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టేది కూడా విజయ సాయిరెడ్డి నే. అలాంటి కీలక నాయ కుడి బంధువులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. సాయి రెడ్డి సొంత బావమరిది ద్వారకానాథ్ రెడ్డి చంద్రబాబు సమ క్షంలో టీడీ పీలో జాయిన్ అయ్యారు. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పై ద్వారకా నాథ్ రెడ్డి , అయన సోదరుడు సురేంద్ర కొద్దికాలంగా అసంతృప్తి గా వున్నారు. అధికార వైసీపీ లో విజయ సాయి రెడ్డి కీలక నేతగా వున్నా, తమకు ప్రాధా న్యం దక్కక పోవడంతో ద్వారకా నాథ్ రెడ్డి టీడీపీ బాట పట్టారు.
విజయ సాయి రెడ్డి బంధువులు టీడీపీ లో చేరడం ఆయనకి ఇబ్బందిగా మారింది. విజయ సాయి రెడ్డి ప్రస్తుతం ప్రకా శం, నెల్లూరు,బాపట్ల, పల్నాడు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా వున్నారు. వైసీపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. అందులో భాగంగా ఆయన రీజనల్ కో ఆర్డినేటర్ గా వున్న జిల్లాల ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో అయన సొంత బావమరిది వైసీపీ కి గుడ్ బై చెప్పడం, టిడిపి లో చేరడం విజయ సాయి రెడ్డికి తలనొప్పిగా మారాయి. సొంత కుటుం బ సభ్యులే పక్క పార్టీలోకి వెళ్తుంటే… అయన తమ టికెట్లనీ ఎలా డిసైడ్ చేస్తారనీ వైసీపీ లోని కొంత మంది నేతలు నిలదీస్తున్నారు. ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాలో ఇంకా అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. ఆ విషయాల పై సాయి రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బావమరిది టిడిపి లో చేరడం తో అధికార వైసీపీ నేతలు విజయ సాయి రెడ్డి చెప్పింది వింటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయ సాయిరెడ్డి కి పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుంది అనే ప్రచారం కొద్దికాలంగా విన్పిస్తోంది. అయన గతంలో ఉత్త రాంధ్ర పార్టీ బాధ్యతలు చూసుకునే వారు. అక్కడ రీజనల్ కో ఆర్డినేటర్ గా వున్న సమయంలో సాయి రెడ్డి పై అనేక ఆరోప ణలు వచ్చాయి. దీంతో ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. కొంతకాలం ఢిల్లీ వ్యవహారాలకు పరిమితం చేశారు. అదే సమయంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సాయి రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సాయి రెడ్డికి బావమరిది ఇచ్చిన షాక్ తో వైసీపీ లో ఆయనకు మళ్ళీ ఇబ్బందులు తప్పేలా లేవని ఆ పార్టీ నేతలు అంటున్నారు.


