విధి నిర్వహణలో శాంతి భద్రతలను కాపాడటమే కాకుండా.. ప్రాణాలను కాపాడటంతో కూడా పోలీసు లు భాగస్వాము లు అవుతూ.. అందిరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. బస్సు కోసం బస్టాండ్‌లో వేచి చూస్తున్న భువనగిరి మండ లం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన బోయిని వెంకటమ్మకు ఉన్న ట్టుండి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి స్పృహ కోల్పోయింది. దీంతో ఏ చేయాలో తెలియక భర్త నర్సింహ రోడ్డుపై ఒక్కసారిగా కేకలు పెట్టాడు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ మానవత్వంతో స్పందించి చాకచక్యంగా మహిళకు సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. అనంతరం వెంటకమ్మను తన వాహనంలో స్థానిక రేణుకాదేవి ఆసుపత్రికి తరలించారు.