వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య బీఆర్ఎస్‌కి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 10న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.ఆరు నెలల నుంచి మానసిక వేదనకు గురవుతున్నానని తాటికొండ రాజయ్య అన్నారు. మాదిగ ఆస్థిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించినా… అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసినా… విధేయుడిగా ఉన్నానని తెలిపారు. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువైందని తెలిపారు. ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి లేదని తాటికొండ రాజయ్య చెప్పారు.


