32.2 C
Hyderabad
Saturday, March 2, 2024
spot_img

రాహుల్ న్యాయయాత్ర ప్లస్ జమిలి ఎన్నికలు

         లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల మరో యాత్ర చేపట్టారు. అదే న్యాయయాత్ర. ఈనెల 14న మణిపూర్ నుంచి రాహుల్ న్యాయయాత్ర ప్రారంభమైంది. రాహుల్ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం తొలుత అనుమతి ఇవ్వలేదు. ఆ తరువాత మణిపూర్‌లోని బీరేన్‌ సింగ్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. రాహుల్ గాంధీ యాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

         మణిపూర్‌లో ప్రారంభమైన న్యాయయాత్ర ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించింది. అట్నుంచి అస్సాం లోకి ప్రవేశించింది. యాత్ర సందర్భంగా అస్సాంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. న్యాయయాత్ర సాగుతుండగా కొంతమం ది బీజేపీ కార్యకర్తలు ఎదురుపడి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ భద్రతా సిబ్బంది జాగ్రత్త పడ్డా రు. రాహుల్‌ను సురక్షితంగా బస్సు ఎక్కించారు.బీజేపీ కార్యకర్తలు ఎదురుపడి నినాదాలు చేసిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ తీరును నిరసిస్తూ, కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. న్యాయయాత్ర చేస్తున్న తమ నేతను బీజేపీ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా యాత్ర చేసే హక్కు ప్రతిపక్షాలకు లేదా అంటూ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక, ప్రజల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. రోడ్డుపై కూర్చుని రాహుల్ నిరసన తెలిపారు.

      గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు చేపట్టిన రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడోయాత్ర సూపర్ విజయవం తమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. అదే జోష్‌‌ను కొనసాగిస్తూ, మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్ని కల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సారథ్యంలో న్యాయయాత్ర ప్రారంభమైంది. భారత్ జోడో యాత్రతో సామాన్య ప్రజల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిన మాట వాస్తవం. అంతేకాదు జోడోయాత్ర సాగిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే ట్రెండ్ ఈసారి న్యాయయాత్ర కొనసాగిన రాష్ట్రాల్లోనూ కనిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే జమిలి ఎన్నికల అంశం తాజాగా తెరమీదకు మరోసారి వచ్చింది. జమిలి ఎన్నికల విషయమై ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలిం చడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం నామ్‌కే వాస్తే అన్నట్లుగానే కనిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

      లోక్‌సభతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి రామ్‌నాథ్ కోవింద్ కమిటీకి ఇప్పటికే 21 వేలకు పైగా సలహాలు, సూచనలు అందినట్లు సమాచారం. అంతేకాదు, వీటిలో 81 శాతం సలహాలు ఏక కాలం ఎన్నికలను సమర్థించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జమిలిపై రాజకీయపార్టీల, మేధావుల, ప్రజాసం ఘాల అభిప్రాయాలను సేకరించామని ప్రజలను మభ్యపెట్టడానికే రామ్‌నాథ్ కోవింద్ కమిటీ అంటున్నారు రాజకీయ పరి శీలకులు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు అస్థిత్వం కోల్పోతాయన్న అభిప్రాయం మేధావి వర్గాల్లో వినిపిస్తోం ది. సహజంగా లోక్‌సభ ఎన్నికలప్పుడు, జాతీయ అంశాలు తెరమీదకు వస్తుంటాయి.అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భం గా ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు తెరమీదకు వస్తుంటాయి. ఈ అంశాలకు అనుగుణంగా అటు లోక్‌సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తుంటారు. మనదేశంలో ఇప్పటివరకు జరుగుతున్న ఎన్నికల తీరు ఇది.

      లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపోయి జాతీయ అంశాలే ప్రధాన మవుతాయన్నది ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది అక్కడి ప్రాంతీయ పార్టీలే. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికలతోపాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక లు ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం లోపాయికారీగా నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్. ఒక్క మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా మినీ జమిలి ఎన్నికలన్నమాట. జమిలి ఎన్నికలు అంటూ వస్తే రామమందిర అంశమే ప్రధానమవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అంటున్నారు.

Latest Articles

పాలమూరు – రంగారెడ్డిపై కాంగ్రెస్ ఆరోపణలు

   దక్షిణ తెలంగాణ వరదాయనిగా పేరొందిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కరువుసీమగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటిని పారించే ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన పాలమూరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్