రైతుల చలో ఢిల్లీ ఆందోళన రెండో రోజు కూడా కొనసాగుతోంది. కిసాన్ యూనియన్లు తమ డిమాండ్లను అంగీకరించే వరకూ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను రప్పించడంతోపాటు, ఢిల్లీకి వివిధ రాష్ట్రాలనుంచివ చ్చే అన్ని రహదారులనూ దాదాపు సీజ్ చేశారు. తొలిరోజు ఆందోళన, ఘర్షణ, డ్రోన్లతో బాష్పవాయువు ప్రయోగం వల్ల దాదాపు 80 మంది రైతులు గాయపడగా, రాళ్లదాడిలో 25 మంది పోలీసులు గాయపడ్డారు. నేడు రెండో రోజు కూడా ఆందోళన కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. కాగా, కాంగ్రెస్ పార్టీ రైతుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించింది. భారత్ బంద్ లోనూ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపు నిచ్చింది.
పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చే శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో పలువురు రైతులు గాయప డిన నేపథ్యంలో హర్యానా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆస్పత్రుల్లో పంజాబ్ ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఏ రైతు వచ్చినా శ్రద్ధతో చికిత్స చేయాలని డాక్టర్లను కోరింది.
దేశ రాజధానికి ర్యాలీగా వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆందోళన కారులు ప్రయత్నించడంతో పోలీసులు బాష్పవాయువు, వాటర్ కేనన్ లను ప్రయోగించారు. ఆందోళనకా రులు రాళ్లు రువ్వడంతో పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ సహా 24 మంది పోలీసులు గాయపడ్డారు. హర్యానాలోని అంబాలా నగరానికి సమీపంలోని శంభు సరిహద్దు వద్ద తమపై జరిగిన దాడిలో 60 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని రైతు నాయకులు తెలిపారు.
కనీస మద్దతు ధరకు హామీ కల్పించే చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్ తో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రైతులు ఈనిరసన ర్యాలీ సాగిస్తున్నాయి. 2021లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఉపసంహ రించుకోవడానికి అంగీకరించినప్పుడు రైతులు పెట్టిన షరతుల్లో ఎంఎస్పీ హామీ చట్టం తీసుకురావాలన్నది కీలకమైం ది. ఆ రోజు ఇచ్చిన హామీని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ ఆందోళన.


