30.2 C
Hyderabad
Friday, March 1, 2024
spot_img

మాల్దీవ్ మంత్రులు వదిలిన మాటలు .. చెడిన రెండు దేశాల బంధాలు

       భారత ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్ మంత్రుల అసందర్భ ప్రేలాపన ఉభయదేశాల మధ్య దౌత్య సంబంధాల్లో చిచ్చురేపింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మనదేశంలోని మాల్దీవుల రాయబారిని రప్పించి తీవ్ర నిరసన తెలిపింది. ఈ వివాదం టూరిజం ద్వారా లాభపడే మాల్దీవుల ఆదాయానికి గండి కొట్టింది. కొత్తగా దౌత్యపరమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

     మాల్దీవు మంత్రుల నోటి దురుసుతనం ఆ దేశం ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రధాని మోదీ ఇటీవల మనదేశంలోని లక్షద్వీప్ లో పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ .. చక్కటి ఫోటోలను షేర్ చేస్తూ, లక్షద్వీప్ లో టూరిజం అభివృద్ధికి గల అవకాశాలను పేర్కొన్నారు. లక్షద్వీప్ లో పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పిస్తే.. టూరిజంలో లక్షద్వీప్ మాల్దీవులో పోటీ పడగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లక్షద్వీప్ లోని అగట్టి ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో మాల్దీవుల మంత్రులు రెచ్చిపోయి అసందర్భం ప్రేలాపనకు దిగారు. మంత్రి మరియం షియునా మరీ పొగరుగా మోదీని జోకర్, కీలుబొమ్మ అని దూషించారు. ఎంపీ జాహిద్ రమీజ్ కూడా అపహాస్యం చేస్తూ, భారతదేశం పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసారు.

      మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు, మాల్దీవు పార్లమెంటు సభ్యుడు సోషల్ మీడియాలో పెట్టిన వివా దాస్పద పోస్ట్ పట్ల భారతదేశంలో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మనదేశంలో మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షహీబ్ ను విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను వ్యక్తం చేసింది.

       ఈ వ్యాఖ్యలపై చిచ్చు రేగడం తో మాల్దీవులు ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మాల్దీవుల అధ్య క్షుడు మొహమ్మద్ ముయిజు ఈ వివాదంతో సంబంధం ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు మోడీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముగ్గురు డిప్యూటీ మంత్రులను సస్పెండ్ చేసింది. యువజన మంత్రిత్వ శాఖలో ఉప మంత్రులుగా ఉన్న మల్షా షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మజీద్ వివాదాస్పద పోస్టుల కారణంగా సస్పెన్షన్ కు గురయ్యారు.

        ఈ వ్యాఖ్యలపై మాలేలోని భారత హైకమిషన్ ఆదివారం మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖకు దాదాపు అపాలజీ తో కూడిన సమాధానమిచ్చింది. విదేశీ ప్రముఖుడైన మోదీ పై సోషల్ మీడియాలో “అభ్యంతరకర వ్యాఖ్యలు” ఉన్నా యని అంగీకరించింది, ఇందుకు సంబంధించి మంత్రులపై వేట వేసిన విషయం గుర్తు చేస్తూ, వారి వ్యక్తిగత అభిప్రా యాలు మాల్దీవుల ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మంత్రులు, ఎంపీ వ్యాఖ్యల పట్ల ఆగ్రహించిన కొందరు భారతీయ పర్యాటకులు మాల్దీవులకు తమ షెడ్యూల్ పర్యటనలను రద్దు చేసు కుంటున్నారు. ఫలితంగా మాల్దీవుల టూరిజం శాఖ కొన్ని వేల కోట్ల రూపాయల మేరకు నష్టపోయింది. మాల్దీవు లలో చైనా అనుకూల వైఖరి గల మొహమ్మద్ మయిజు ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత నుంచి భారత వ్యతిరేక వైఖరి వ్యక్తమవుతోంది. ఇది భవిష్యత్ లో మాల్దీవుల ఆర్థి క వ్యవస్థను ఏ మేరకు కొంపచుతుందో చూడాలి.

Latest Articles

లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ సరికొత్త వ్యూహాలు

      లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకువెళ్తోంది. మరో రెండు నెలల్లో సార్వత్రిక సమరం మొదలు కానుండడంతో ఆ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలదళం గెలుపు గుర్రా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్