కాదేది మోసానికి అనర్హం. ఇది పాత మాట అనుకున్నారో ఏమో కొందరు కేటుగాళ్లు నయా రూట్ లో కంత్రీ పనికి దిగారు. ఓల్డ్ మోడల్ మోసాలు కాదు రోల్ మోడల్ మోసాలు చేయాలని నేరగాళ్ల ముఠా భావించినట్టుంది. టర్కీలో చలామణిలో లేని కరెన్సీని ఇక్కడ అమాయకులకు అంటకట్టి టోకరా వేయడానికి ప్రయత్నించింది. అయితే, పోలీసుల డేగ కన్ను నుంచి తప్పించుకోలేక కటకటాల పాలైంది.
ఆ కరెన్సీ ఆ దేశంలో చలామణిలో లేదు. అయితే, అదే కరెన్సీని మన దేశంలో చలామణి చేయడానికి సిద్ధయ్యారు కేటుగాళ్ళు. అయితే, పోలీసులు రంగంలోకి దిగి ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ సాగిం చిన నిర్వాకం ఇది. టర్కీ దేశంలో రద్దయిన నిషేధిత లిరా నోట్లను తక్కువ ధరకే ఇస్తామని ఓ ముఠా ప్రచారం మొదలె ట్టింది. కొందరు అమాయకులు ఈ మోసగాళ్ల మాటలకు ఆకర్షితులై మోసానికి గురయ్యారు. హైదరాబాద్ చింతలకుం టలో నిషేధిత టర్కీ నోట్లను విక్రయించడానికి అంతరాష్ట్ర ముఠా సభ్యులు రెడీ అయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం ఏలూరు కు చెందిన మంచినీళ్ల ఓం నాగప్రసాద్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో ఉంటున్న మరో వ్యక్తి నుంచి టర్కీ నోట్లను కొనుగోలు చేశాడు. అయితే, ఈ నోట్లు టర్కీలో రద్దయ్యాయని తెలుసుకున్న నాగప్రసాద్, అతి తెలివి ప్రదర్శించబోయి భంగపడ్డా డు. టర్కీ కరెన్సీ తక్కువ ధరకే ఇస్తానని, ఈ కరెన్సీని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ధనవంతులైపోవచ్చని కహానీలు చెప్పడం మొదలెట్టాడు.
వాక్చాతుర్యం ఉండాలే కాని.. ఎలాంటి వారినైనా బుట్టలో పడేయొచ్చని నమ్మే మంచినీళ్ల ప్రసాద్.. ఆ రూట్ లో ముందుకు సాగాడు. తన నేర సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ….ఓ ముఠానే ఏర్పాటు చేసేశాడు. ఏలూరు జిల్లా సామవర ప్పాడుకు చెందిన గుడిమీద జ్యోతిరవితేజ, అన్నవడ్డెరపేటకు చెందిన తోట వెంకట నాగరాజు తొలుత ప్రసాద్ కు పరిచ యం అయ్యారు. ఈ ముఠాకు కాకినాడకు చెందిన మారుతి తేజ, నిమ్మగంటి జీవన్‌సత్య, పులి బుజ్జిలు పరిచయమ య్యారు. వీరందరూ భారీ ముఠాగా ఏర్పడి తక్కువ ధరకే టర్కీ కరెన్సీ విక్రయిస్తామని ఎందరినో నమ్మించేశారు. రద్దయిన నోట్లను విక్రయించేసి లక్షల రూపాయలు కొట్టేశారు.LB నగర్ పోలీసులు, SOT పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తు సాగించారు. నిందితుల నుంచి 99 లిరా నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఇండియన్ కరెన్సీలో 27 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. నిందితుల నుంచి టర్కీ కరెన్సీతో పాటు, స్కార్పియో వాహనం, రెండు వాకి టాకీలు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓం నాగ ప్రసాద్, జ్యోతి రవితేజ, నాగరాజు, జీవన్ సత్య, తేజలను అరెస్ట్ చేశారు. బ్లాక్ కరెన్సీ పేరుతో మోసానికి పాల్పడిన ఇద్దరు విదేశీయులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ మోసాలు, విదేశీ కరెన్సీ మోసాలు…ఇలా పలు తరహాల్లో నిందితులు మోసాలకు తలపడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలియజేస్తున్నారు.