26.2 C
Hyderabad
Thursday, February 22, 2024
spot_img

బీహార్ రాజకీయ వృద్ధండుడు నితీశ్ జీవిత ప్రస్థానం

          నితీశ్ సోష‌లిస్టు ఐడియాల‌జీతో ప్ర‌భావితుడైన నేత‌. జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ఆయ‌న రాజ‌కీయ గురువు. సెక్యుల‌ ర్ వాదిగా పేరున్న నితీశ్ కుమార్ చాలా కాలం పాటు బీజేపీకి దూరంగా ఉన్నారు. అయితే బీహార్ లో ఆర్జేడీ ని దెబ్బ‌తీ య‌డానికి ఒక దశలో క‌మ‌లం పార్టీతో చేతులు క‌లిపారు. మొత్తం మీద 24 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు ….ఫిరాయింపులతో రసవత్తర రాజకీయానికి తెరతీశారు ఈ బీహార్ రాజకీయ వృద్ధండుడు. బీహార్ రాజకీయ చరిత్రలో నితీశ్ ముద్ర చెరిగిపోనిదని జాతీయ మీడియా సైతం స్పష్టం చేసింది. బీహభర్ సీఎం నితీశ్ రాజకీయ ప్రస్థానాన్ని సింహావలోకన చేద్దాం

      పాట్నా సమీపంలోని ఓ భక్తియార్ పుర్ లో 1951లో నీతీశ్ కుమార్ జన్మించారు. ఆయన తండ్రి స్వాతంత్య్ర్య సమర యోధుడు, ఆయుర్వేద వైద్యుడు. బీహార్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రస్తుతం పట్నా ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన నీతీశ్, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్య మంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే లాలూ ప్రసాద్, సుశీల్ కుమార్ మోదీ వంటి నేతలతో పరిచయం ఏర్పడింది. అలా బీహార్ రాజకీయ తెరపై నితీశ్ ప్రత్యేక ముద్రను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి నితీశ్ బీహార్ రాజకీయాలను ఆమూలాగ్రం ఒంటబట్టించుకున్నారు.

      నితీశ్ దాదాపు 24 సంవత్సరాల క్రితం, లాలూ ప్రసాద్ యాదవ్ ‘జంగిల్-రాజ్’కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తర్వాత, నితీష్ కుమార్ మార్చి 3, 2000న మొదటిసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన తన మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆయన కేవలం ఏడు రోజులు మాత్రమే సీఎం సీటుకు పరిమితమయ్యారు. ఆ తర్వాత నితీశ్ మళ్లీ నవంబర్ 24,2005న బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వా న్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దాదాపు పది నెలల పాటు అంటే మే 20, 2014 నుంచి ఫిబ్రవరి 21, 2015 వరకు బీహార్ సీఎంగా కొనసాగాడు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైన తర్వాత జితన్‌రామ్‌కు పరిపాలన పగ్గాలు అప్పగించారు. మొత్తం మీద, 2000 సంవత్సరం నుండి 2024 మధ్య నితీశ్ బీహార్ సీఎంగా తొమ్మిది సార్లు ప్రమాణం చేశారు.

     2013లో భాజపాకు బ్రేకప్ చెప్పిన నీతీశ్ కుమార్.. కాంగ్రెస్, సీపీఐ సాయంతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. తదుపరి ఏడాది లోకసభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధికారం నుంచి వైదొలిగారు. ఆ సమయంలో తొమ్మిది నెలలపాటు జితన్ రామ్ మాంఝీ సీఎంగా కొనసాగారు. 2015లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కలిపి మహా కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అది రెండేళ్లపాటే కొనసాగింది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్ పై అవినీతి ఆరోపణలు రావడంతో నిర్ణయాన్ని మార్చుకున్న నీతీశ్. 2017లో తిరిగి ఎన్టీఏ గూటికి చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పరాజయానికి కారణం బాజపానే అని బావించిన సీతీశ్ కుమార్. 2022లో మళ్లీ ఎన్డీఏను వీడారు. తిరిగి మహాకూటమికి చేరువైన ఆయన.. సీఎంగా బాధ్యతలు చేపట్టి 18నెలలు గడవక ముందే మళ్లీ కాషాయ పార్టీతో దోస్తీకి సై అన్నారు..

       బీజేపీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత 2013లో బీజేపీతో 17 ఏళ్ల నాటి పొత్తును వదులుకున్నారు. నితీశ్ నేతృత్వంలోని జేడీయు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మరుసటి సంవత్సరం, 2015లో నితీశ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో జతకట్టారు. మహాకూటమితో చేరి అసెంబ్లీ ఎన్నికలలో పోరాడారు. దీంతో ఘనవిజయం సాధించాక నితీశ్ మళ్లీ నవంబర్ 20, 2015న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అనూహ్యంగా ఏర్పడిన రాజకీయ పరిణామాల్లో భాగంగా నితీశ్ 2017లో మరో యూ-టర్న్ తీసుకున్నారు. ఆయన మహాకూటమిని వదులుకుని ఎన్డీఏలో చేరాడు. ఆర్జేడీ అవినీతి ఊబిలో ఇరుక్కోవడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్డీయే సారథ్యంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో భాగంగా నితీశ్ జెడియు 2019 లోక్‌సభ ఎన్నికలు 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. 2022లో బీజేపీ తనపై కుట్ర పన్నిందని జెడి-యు ఎమ్మెల్యేలను తిరుగుబాటుకు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిందని బిజెపిని నిందించారు.దీంతో నితీశ్ పార్టీ నుండి వైదొలిగారు. మళ్లీ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి రెండవ మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

       అంతకుముందు 1996లో జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీని స్థాపించిన రెండేళ్లలోనే, మళ్లీ బీజేపీలోకి మారారు. అటల్ బీహార్ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న హయాంలో ఆయన మంత్రి అయ్యారు. 2003లో, శరద్ యాదవ్‌తో విడిపోయిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీని స్థాపించినప్పుడు, నితీష్ కుమార్ తన సమతా పార్టీని జనతాదళ్‌లో విలీనం చేసారు. ఆ తర్వాత కొత్త కూటమికి జనతాదళ్ యునైటెడ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు నితీశ్ ,లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య దశాబ్దాలుగా స్నేహభావం, శత్రుత్వం కొనసాగుతున్నాయి. 1974 విద్యార్థి ఉద్యమం నుండి రాజకీయాల్లో చురుకుగా ఉన్న నితీశ్ 1990లో యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో మొదటిసారి హర్‌నౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1989లో బార్హ్ స్థానం నుంచి మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 1996, 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఆయన 1989లో విపి సింగ్ క్యాబినెట్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 1999,2004 మధ్య వివిధ సమయాల్లో ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో ఉపరితల రవాణా, వ్యవసాయం, రైల్వే వంటి హెవీ వెయిట్ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.

         మొత్తం మీద పార్టీలు మారే సంగతిని పక్కన పెడితే బీహార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన నితీశ్ కుమార్ సమర్థత చాటుకున్నారు. వికాస్ పురుష్ అంటూ బీహార్ ప్రజలు ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. దేశ రాజ‌కీయాల్లో ఒక ద‌శ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి దీటైన ప్ర‌త్య‌ర్థి నితీశ్ కుమారే అనే ప్ర‌చారం కూడా బలంగానే న‌డిచిం ది. వ‌ర్త‌మాన దేశ రాజ‌కీయాల్లో నితీశ్ కుమార్‌ ముద్ర శాశ్వతమైందని జాతీయ మీడియా సైతం స్పష్టంగా పేర్కొంది.

Latest Articles

విమర్శల పర్వంలో రూటు మార్చిన రాహుల్ గాంధీ

       కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు రూటు మార్చారు. మొన్నటి వరకు అదానీపై విమర్శలు గుప్పిం చిన అగ్రనేత.. ఇప్పుడు బాలీవుడ్‌ నటులపై బాణాలు ఎక్కుపెట్టారు. అదానీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్