బీహార్‌లోని ఔరంగాబాద్ నుంచి ఇవాళ రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభంకానుంది. ఔరంగా బాద్‌లో తిరిగి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమవుతుందని, మధ్యా హ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొం టారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తెలిపారు. సోనియాగాంధీ రాజ్యసభకు నామినేషన్ కార్య క్రమం సందర్భంగా రాహుల్ యాత్ర వాయిదా పడింది. జైపూర్‌లో సోనియా నామినేషన్ వేశారు. ఈ కార్య క్రమంలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. మరోవైపు ఢిల్లీలో రైతులు జరుపు తున్న ఆందోళనలో పాలు పంచుకునేందుకు రాహుల్ వెళ్లడంతో నిన్న యాత్ర రద్దయినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర షెడ్యూల్ ప్రకారం 68 రోజుల్లో 6 వేల 713 కిలోమీ టర్లు ప్రయాణించాల్సి ఉంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా ప్రయాణిస్తూ మార్చి 20న ముంబైకి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. మధ్య మధ్యలో రాహుల్ బ్రేక్‌లు తీసుకుంటున్నారు.