29.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

బంగ్లాదేశ్ లో ఐదోసారి ప్రధానిగా షేక్ హసీనా….. చైనా వైపు అడుగులు వేస్తుందా ?

       బంగ్లాదేశ్ పార్లమెంట్ జాతీయ సంసద్ 300స్ధానాలకు జనవరి 7న జరిగిన ఎన్నికల్లో అనుకున్నట్లుగానే అధికార అవామీలీగ్,ఇతర మిత్రపక్షాలు అఖండ విజయం సాధించాయి. అవామీలీగ్ స్వయంగా 222 స్ధానాలలో గెలుపొందగా జాతీయపార్టీ వంటి మిత్రపక్షాలు, స్వతంత్రులు 62 స్ధానాలు చేజిక్కించుకున్నారు. శ్రీమతి ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం బంగ్లనేషనలిస్టు బిఎన్ పి, ఇస్లామిక్ మతవాద జమాత్ పార్టీలు స్వేచ్చగా, న్యాయంగా జరగడం లేదని ఎన్నికలను బహిష్కరించాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వ ఆధ్వ ర్యంలో ఎన్నికలు జరపాలని బిన్ పి చేసిన డిమాండ్ ను హశీనా తిరస్కరించారు. గోపాల్ గంజ్ 3స్ధానం నుండి భారీ మెజారిటీతో గెలుపొందిన షేక్ హసీనా వరుసగా 4వ సారి మొత్తం మీద 5వ సారి బంగ్లాదేశ్ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు బూటకమని బిఎన్ పి ఆరోపించగా, ప్రధాన ప్రతిపక్షం పాల్గొనని పార్లమెంట్ ఎన్నికలకు మాన్యత లేదని ఆమెరికా తదితర పాశ్చాత్య దేశాలు అభివర్ణించాయి. ఎన్నికల బహిష్కరణ పిలుపు ప్రభావం కొంత పని చేసినట్లుంది.

     దాదాపు 12కోట్ల ఓటర్లలో 42శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవడం అందుకు నిదర్శనం. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికలలో హైదరాబాద్ మహానగరంలో కేవలం 39శాతం ఓటింగ్ జరగడాన్ని బట్టి చూస్తే ఆసక్తి, ఉత్సాహం లేని ఎన్నికల్లో ప్రజలు పాల్గొనడం తక్కువేనని స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్ లో కూడా అవామీలీగ్ అధికార అభ్యర్థులపై పార్టీ తిరుగుబాటుదార్లు, ఇతరులు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. బంగ్లా నేషనలిస్ట్ పార్టీ 2014 సందర్భంగా కూడా ఇవే ఆరోపణలు చేసి, ఎన్నికలు బహిష్కరించింది. అయితే 2018 ఎన్నికలలో పాల్గొన్నా కేవలం 7స్ధా నాలే గెలిచింది. వచ్చే ఐదేళ్లలో బంగ్లాదేశ్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని హసీనా అన్నారు.

     ఎన్నికలలో పాల్గొనాలో వద్దో నిర్ణయించుకునే హక్కు ప్రతి పార్టీకి ఉంటుందని, ఒక పార్టీ ఎన్నికలలో పోటీ చేయ నంత మాత్రాన బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం లేదనడం సరికాదని హసీనా అన్నారు. గత 15 ఏళ్ళుగా అధికారంలో వున్న షేక్ హసీనా అవామీలీగ్ ఈసారి కూడా ఘనవిజయం సాధించడంతో ప్రస్తుతం బంగ్లా పార్లమెంటరీ వ్యవస్థలో తిరుగు లేని నాయకురాలిగా నిలిచారు. భారత సైన్యం దన్నుతో బంగ్లా ముక్తివాహిని జరిపిన పోరాటంలో విజయం సాధించి, దేశ నాయకత్వ బాధ్యతలను చేపట్టిన వంగబంధు షేక్ ముజీబుర్రహ్మాన్ ను, ఆయన భార్య, ముగ్గురు కుమారులను 1975లో అప్పటి సున్యాధికారులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అప్పుడు విదేశాలలో చదువుకుం టున్న షేక్ హసీనా, ఆమె చెల్లెలు ప్రాణాలతో మిగిలారు. ఆ తర్వాత 1996లో షేక్ హసీనా తొలిసారి బంగ్లా ప్రధాని అయ్యారు. తర్వాత ఖలీదాజియా నాయకత్వంలో అధికారానికి వచ్చిన బంగ్లా నేషనలిస్టు పార్టీ జమాత్ ఇ ఇస్లామ్ తదితర జిహాదీ శక్తుల ఒత్తిడికి లొంగి, ఇస్లామిక్ రాజ్యాంగంగా మార్చి హిందువులకు హక్కులు లేకుండా చేసి మత వాద, భారత వ్యతిరేక, అమెరికా అనుకూల విధానాలను అనుసరించి ఉపఖండంలో అశాంతికి ఆజ్యంపోశా రు.

         2018పార్లమెంట్ ఎన్నికలలో 80శాతం ఓట్లు పోలవ్వగా ఈసారి 42శాతం మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నట్లు బంగ్లా దేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ కాజీ హబీబుల్ అవల్ తెలియజేశారు. గెలిచిన వారిలో 62 మంది అవామీలీగ్ తిరు గుబాటుదారులు, అనుకూల స్వతంత్రులు ఉన్నందున, అర్థవంతమైన ప్రతిపక్షం ఉండకపోవచ్చని, పరిసశీల కులు అభిప్రాయపడ్డారు. స్వేచ్చగా, న్యాయంగా ఎన్నికలుజరిగాయని ప్రపంచానికి చాటడానికి వారిని పోటీకి అవామీ లీగ్ ప్రోత్సహించిందని, బంగ్లా నేషనలిస్టు పార్టీ చేసిన ఆరోపణలను ఆపార్టీ ఖండించింది. మాన్యత లేని ఈ బూటకపు ఎన్నికలను రద్దుచేసి, తటస్థప్రభుత్వ ఆధ్వర్యంలో మళ్లీ ఎన్నికలు జరపాలని బిఎన్ పి  డిమాండ్ చేయడం గమనా ర్హం.

       భారత్ లో కూడా శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలోని కమలం పార్టీ వచ్చే ఏప్రిల్, మేలో జరిగే లోక్ సభ ఎన్నికలలో గెలిచి 3వ సారి అధికారంలోకి రావడానికి బహుముఖ వ్యూహాలు అనుసరిస్తూ ప్రాంతీయ పార్టీలను కట్టడి చేస్తూ, తమకు అనుకూలంగా మార్చుకోవడానికి శతవిధాలా యత్నిస్తోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి బలపడకుండా చేయవలన దంతా చేస్తోంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల వైభవాన్ని, ప్రతిష్టను నిలిపి, అయోధ్యలో దివ్య మైన, భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని పూర్తిచేసి, మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుని ఆదర్శాలను నిలిపి, భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన శ్రీ నరేంద్రమోదీ 3వ దఫా భారత ప్రధాని కావడం ఖాయమని కాషాయ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లో కూడా ఇలాగే వ్యక్తి పూజ పరాకాష్టకు చేరి షేక్ హసీనాను బంగ్లా మాతగా అభి వర్ణిస్తున్నారు. గతంలో దేశంలో అత్యవసర పరిస్థితులు అమలులో ఉన్నపుడు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ డి కె బారువా నాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీని ఇందిరే ఇండియా, ఇండియా ఏ ఇందిర అని కీర్తించిన విష యం తెలిసిందే.

      బంగ్లాదేశ్ కు 5వ సారి ప్రధాని అవుతున్న హసీనా భారత్ కు గొప్ప స్నేహితురాలు. వారి కుటుంబమంతా దారుణ హత్యలకు గురైనపుడు హసీనా తదితరులకు భారత్ ఆశ్రయమిచ్చింది. 1971లో బంగ్లా విముక్తికోసం పోరాడినపుడు, 1975లో షేక్ ముజీబర్ రహ్మాన్ కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురైనప్పుడు భారత్ చేసిన సాయాన్ని మరువ లేని హసీనా తరచూ అంటుంటారు. అందుకే భారత బంగ్లాదేశ్ మధ్య భూ, సముద్ర సరిహద్దుల వివాదం ఉభయ తారకంగా పరిష్కారమయ్యాయి. పలు నగరాలకు రైళ్లు నౌకల ప్రయాణ, సరకుల రవాణా పెరిగి వాణిజ్యం ఊపందు కుంది. 5వ సారి ప్రధాని అవుతున్న షేక్ హసీనాకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు. లేఖ కూడా రాశారు.ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన బంగ్లా ప్రజలను కూడా ప్రధాని మోదీ అభినందించారు. భారత, బంగ్లాదేశ్ ల మధ్య ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని, బంగ్లా అభివృద్ధికి ఆన్ని విధాలా తోడ్పడతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

    బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య ప్రస్థానం అంత సజావుగా సాఫీగా జరగలేదు.1971లో పాక్ సైనిక, పశ్చిమ పాక్ నాయకులను ఎదిరించి పోరాడి ప్రజలు స్వతంత్ర బంగ్లాదేశ్ ను సాధించారు. పశ్చిమపాక్ ఆహార అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయా లకు, బంగ్లా సంస్కృతి సంప్రదాయాలకు పొంతన కుదరక అణచివేతకు గురైన బంగ్లా ప్రజలు పోరుబాట ద్వారా స్వాతంత్ర్యం సాధించుకుని వెనుకబడిన స్థాయి నుంచి వర్ధమాన దేశంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ లో 91శాతం జనాభా ముస్లింలే. హిందువుల జనాభా 1941లో 28శాతం. స్వతంత్ర దేశంగా ఏర్పడిన నాడు హిందువుల జనాభా13.5శాతం.ప్రస్తుతం హిందువుల జనాభా 8శాతం. హిందువులకు సమాన హక్కులు ఇవ్వరాదని జిహాదీల డిమాండ్. బీఎన్ పి వారికి వత్తాసు పలుకుతూ భారత వ్యతిరేక వైఖరి అనుసరిస్తోంది. ఉపఖండంలో కీలక స్థానంలో ఉన్నందున చైనా, అమెరికా బంగ్లాదేశ్ పై ప్రభావం చూపి ప్రాబల్య విస్తరణకు ప్రయత్నిస్తున్నాయి.

          చైనా, బంగ్లాదేశ్ లో ఎన్నో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భాగస్వామిగా ఉంది. భారత రష్యా లు కూడా బంగ్లాలో అణువిద్యుత్ కేంద్రం నిర్మాణానికి తోడ్పడుతున్నాయి.అందరి సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని హసీనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హిందువులకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తూ, సమ్మిళితం అభివృద్ధికి అవామీలీ గ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. బంగ్ల విముక్తి వ్యతిరేక శక్తులను హసీనా ప్రభుత్వం కఠినంగా అణచి వేస్తుండటంతో బీఎన్ పి, జమాత్ పార్టీల కిందిస్థాయి కార్యకర్తలు అధికాది ధీకంగా అధికార పార్టీలో చేరుతున్నారు. వీరి మతవాద దృక్పథం అవామీలీగ్ లౌకిక వాదాన్ని నీరు గరుస్తున్నది. సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ వంగ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ , ప్రముఖ నవలా రచయిత శరత్ చంద్ర చటర్జీల రచనలలో దుర్గామాత ప్రస్తావనలున్నాయని మతవాదులు వాటిని పాఠ్య పుస్తకాల నుండి తొల గింపజేయడం విచారకరం. అవామీలిగ్ హసీనా తర్వాతి తరం క్రమంగా చైనా వైపు మొగ్గినా ఆశ్చర్యం లేదంటున్నారు.17కోట్లకు పైగా జనాభా గల బంగ్లాదేశ్ శాంతి విస్తరణలతో పురోభివృద్ధి చెందాలని భారత్ పొరుగు మిత్రదేశంగా బలంగా కోరుకుంటుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్