ఆలూరు సాయి శ్రీ స్కూల్ ప్రిన్సిపాల్ అర్చన పైశాచికత్వాలు రోజు రోజు కు పెరిగిపోతున్నాయని , ఆమె పై చర్యలు తీసుకోవాలని ఆలూరు పోలీస్ స్టేషన్లో బాదితులు పిర్యాదు చేశారు. పెద్ద హోతురు గ్రామానికి చెందిన భాస్కర్ తెలిపిన వివరాల మేరకు తమ కుమారుడు జశ్వంత్ సాయి శ్రీ స్కూల్ లో 5 వ తరగతి చదువుతున్నాడని రెండు రోజుల నుండి స్కూల్ వెళ్ళడానికి భయపడుతూ ఎదో వంక చెబుతూ నిరాకరిస్తూన్నాడని నిన్న రాత్రి విచారించగా గత మంగళవారం రోజు జశ్వంత్ క్లాస్ రూములో ఒరేయ్ , రాలే అని దుర్భాశలాడాడని తన తోటి విద్యార్థి ప్రిన్సిపాల్ అర్చన కు పిర్యాదు చేయగా , ప్రిన్సిపాల్ జశ్వంత్ ని పిలిపించి ఫ్లోర్ క్లినింగ్ స్టిక్ తో బలంగా కొట్టి పంపిందని బాలుడు తెలియచేశాడు. ప్రస్తుతం జశ్వంత్ చేయి ఎముక విరిగిందని నొప్పి భరించలేక పోతున్నడని ఇదే విషయం ప్రిన్సిపల్ కు ఫోన్ చేస్తే ఉదయం స్కూల్ కు రండి మాట్లాడదాం అని చెప్పి , స్కూల్ వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండ తమపైనే బాధ్యత నెట్టేస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అందుకే ప్రిన్సిపాల్ పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు తండ్రి భాస్కర్ తెలిపారు.ఇక ఇదే విషయంపై DYFI విద్యార్థి సంఘం నాయకుడు మైనా బాషా మాట్లాడుతూ సాయి శ్రీ స్కూల్ అనే స్కూల్ ని అక్రమంగా శ్రీ చైతన్య కార్పొరేట్ సంస్థ ఆధీ నంలో నడిపిస్తూ విద్యార్థులను అనేక రకాలుగా హింసిస్తున్నారని , గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని ఇదే ప్రిన్సిపాల్ పైశాచికంగా వ్యవహరించి ఒక విద్యార్థిని బట్టలు విప్పించి నిలబెట్టిన ఘటన చోటు చేసుకున్నా విద్యాధికారులు పట్టించుకోలేదని ఇప్పటికైనా అధికారులు సాయి శ్రీ స్కూల్ పై చర్యలు చేపట్టకోపోతే జశ్వంత్ పోరాటం మరింత ఉదృతం చేస్తామని DYFI నాయకులు మైనా బాషా తెలిపారు.


