22.7 C
Hyderabad
Sunday, March 3, 2024
spot_img

పోలీసులను కలవరపెడుతున్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ స్టోరీ

           పంజాగుట్ట పీఎస్ అంటే ఒకప్పుడు నెంబర్ 1. అలాంటి పోలీసు స్టేషన్ ఎందుకింత దారుణమైన స్థాయికి దిగజారింది. భాగ్యనగర్ ఘనకీర్తిని చాటిన మోడల్ పోలీస్ స్టేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.నగరం నడిబొడ్డున ఉన్న ఆ స్టేషన్ లో భారీగా బదిలీలు జరగడం ప్రస్తుతం పోలీస్ వర్గాలను కలవరపెడుతోంది.

         హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్ లో పోలీస్ సిబ్బందిని మూకుమ్మడిగా బదిలీచేయటం సంచలనంగా మారింది. అవినీతి, అక్రమాలు, విధుల్లో నిర్లక్షం కారణం ఏదైనా సస్పెండ్ సమాధానం అంటున్నారు అధికారులు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో పోలీసుల తీరుపై హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్‌లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేసిన సీపీ, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. దీంతో మిగతా పోలీస్ శాఖలో సిబ్బంది కి గట్టి హెచ్చరిక జారీచేసినట్లయింది.

          హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో కొంత కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఆయన మొత్తం ఠాణాలోని సిబ్బందిని బదిలీ చేశారు. మొత్తం 85 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే సీపీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఠాణా నుంచి వివరాలు బయటకు పొక్కడమేనని పోలీసు వర్గాల్లో టాక్. అసలేం జరిగిందంటే? గత నెల 23న తెల్లవారుజాము 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజాభవన్ దగ్గర ఉన్న బారికేట్ల పైకి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే కారు దగ్గరకి చేరుకుని వాహనంలో ఉన్న సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం అతడిని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి నిందితుడు తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అతని స్థానంలో తన కారు డ్రైవర్‌ను పంపించాడు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు సాయంతో షకీల్ అనుచరులు సాహిల్‌ను దుబాయ్ పారిపోయేందుకు సహకరించారు.

         రోడ్డు ప్రమాదం జరిగిన రోజు బోధన్ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్ పంజాగుట్ట సీఐతో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు అబ్దుల్ వాసే సహకరించినట్లు తేల్చారు. అనంతరం సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు, సీఐల ఇద్దరి కాల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీసులు దర్యాప్తు చేసి ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ సిబ్బంది తీరుపై సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీఎస్‌ నుంచి కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ నుంచి హోంగార్డు వరకు 85 మందిని బదిలీ చేశారు. సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని వివిధ పీఎస్‌ల కొత్తగా 82 మంది సిబ్బందిని పంజాగుట్ట పీఎస్‌కు బదిలీ చేశారు.

        ఖాకీల అత్యుత్సాహం వరుస సంఘటనలతో పోలీసుశాఖకు అప్రతిష్ట పాలవుతుంది. ఇవేకాక పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ తరచూ వివాదాల్లో నిలుస్తోంది. ఇటీవల అమీర్‌అలీ అనే దొంగ మద్యం మత్తులో కారు నడుపుతూ పంజాగుట్ట వద్ద బీభత్సం సృష్టించాడు. స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షల కు తరలించగా పోలీసుల కళ్లుగప్పి ఉడాయించాడు. గతంలో ఇదే పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే సమయంలో మద్యం తాగుతూ పట్టుబడ్డారు. ఇక్కడ పనిచేస్తున్న ఒక ఎస్‌ఐ స్టేషన్‌కు వచ్చే మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. నాలుగు సంవత్సరాల క్రితం రౌడీషీటర్లతో స్నేహం చేసి పంచాయితీలకు పాల్పడిన ఇదే ఠాణాలో ఓ ఎస్ఐను విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఎవరొచ్చినా కొందరు ఎస్ఐలు బేరసారాలు ఆడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మెరిడియన్ హోటల్ లో దాడి ఘటనలో బాధితున్ని హాస్పటల్ కు తరలించడంలో నిర్లక్ష్యం వహించి వ్యక్తి మృతికి కారణమయ్యారు పోలీసులు. ఇలా అనేక వరస ఘటనలత ప్రక్షాళన దిశగా సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

         సిటీ మొత్తం మీద ఇటీవల కాలంలో పలువురు ఇన్ స్పెక్టర్లు సస్పెన్షన్ కు గురయ్యారు.. పంజాగుట్ట సిఐ తో పాటు పహాడి షరీఫ్ సీఐ , పటాన్చెరువు సీఐ, గోపాలపురం సిఐ, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సీఐ, కెపిహెచ్బి సిఐ, తో పాటు కూకట్పల్లి ఎస్సై , రాజేంద్రనగర్ మహిళా కానిస్టేబుళ్లు సస్పెన్షన్ కు గురయ్యారు. నగర సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే పోలీసులకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన, నిందితులతో చేతులు కలిపి సహకరించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నట్లుగానే వివిధ కారణాల చేత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ప్రక్షాళన చేశారు. వీరితోపాటు హైదరాబాద్ సిటీ కమిషనరేట్ లో ఉన్న 60 శాతానికి పైగా పోలీస్ స్టేషన్లో ఇన్ స్పెక్టర్ల ను బదిలీ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇన్స్పెక్టర్ల ట్రాన్స్ఫర్ లలో ఈ రేంజ్ లో బదిలీలు కావటం ఇదే మొదటిసారి… ఇన్స్పెక్టర్ల బదిలీలకు ముందు ఎస్ బి ఎంక్వయిరీ లతోపాటు పోలీస్ స్టేషన్ వ్యవహారాలన్నిటి పైన నివేదిక తప్పించుకున్న తర్వాతనే ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు.

       ఇక ఏమాత్రం నిర్లక్ష్యం వహిoచిన సహించేది లేదనే సంకేతాలు హైదరాబాద్ సిపి జారీ చేశారు. గతంలో మాదిరి పొలిటికల్ పోస్టింగ్లకు ఆస్కారం లేకుండా పూర్తిగా ఇంటెలిజెన్స్ ఎంక్వయిరీలు, ఎస్బి నివేదికల ఆధారంగానే బదిలీలు జరిగినట్టు సమాచారం.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సిటీలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్ లపై ఎంక్వయిరీ జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల లెటర్స్ , సిఫార్సుతో పోస్టింగులు పొందిన ఇన్స్పెక్టర్లపై ఎంక్వైరీ నడుస్తుంది.ఆలాంటి పోస్టింగ్ లు పొందిన ఇన్స్పెక్టర్ ల లిస్ట్ సిద్ధం చేసి వారి పై సైలెంట్ గా విచారణ జరుపుతున్నారు.. ఎలాంటి పొలిటికల్ పోస్తింగ్స్ కు ఆస్కారం లేకుండా పూర్తిగా నివేదికల ఆధారంగా ప్రస్తుతం కమిషనరేట్ లో పోస్టింగ్స్ నడుస్తునాయి. మరో పక్క పంజగుట్ట పిఎస్ పరిధిలోని ప్రజా భవన్ సమాచారం లీక్ అవుతుందని గుర్తించారు. 2018లో ఉత్తమ పిఎస్ గా జాతీయ స్థాయి అవార్డు అందుకున్న పంజాగుట్ట పిఎస్ ఇటీవల సిబ్బంది తీరుతో అభాసుపాలు అవుతుంది. సో హైదరాబాద్ సిటి పోలీస్ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Latest Articles

పాలమూరు – రంగారెడ్డిపై కాంగ్రెస్ ఆరోపణలు

   దక్షిణ తెలంగాణ వరదాయనిగా పేరొందిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కరువుసీమగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటిని పారించే ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన పాలమూరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్