26.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

పలమనేరు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ గల్లంతేనా ?

        చిత్తూరు జిల్లా పలమనేరులో ఈసారి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీ వల వైసీపీ విడుదల చేసిన ఏడు జాబితాల్లోనూ వెంకటేగౌడ పేరు లేకపోవడంతో పలమనేరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్తి ఎవరనేది ఆసక్తిగా మారింది. దీంతో పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో భాగంగా ఆర్. వి. సుభా ష్ చంద్రబోస్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నగరి మంత్రి రోజాను పలమనేరులో పోటీ చేయమని అధి ష్టానం కోరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పలమనేరులో వైసీపీ అభ్యర్థి ఎవరనేది సందిగ్ధంగా మారింది. ఇదిలా ఉండగా, మాజీ మంత్రి అమరనాథరెడ్డి టీడీపీ తరపున ఆరు నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళుతూ ఎన్ని కల ప్రచారం చేస్తున్నారు. నాయకుడు లేని వైసీపీ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు టీడీపీలోకి చేరుతు న్నారు. వెంకటే గౌడ మీద ఆరోపణలు, సర్వేలో వ్యతిరేకత రావడంతో అమరనాథరెడ్డికి దీటైన అభ్యర్థి కోసం వైసీపీ అధిష్ఠానం ఇంకా గాలిస్తున్నట్లే తెలుస్తుంది.

      ఏమాత్రం రాజకీయ నేపథ్యంలేని వెంకటేగౌడ 2019 ఎన్నికల్లో పలమనేరు వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొం దారు. గెలిచిన ఏడాదిన్నరకే నియోజకవర్గంలోని పలువురు సీనియర్‌ నాయకుల పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపించా రు. దీంతో వాళ్లంతా అంటీముట్టనట్లు ఉండిపోయారు. నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులను అప్పగించడంలోనూ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. శంకర్రాయలపేట చెరువు నుంచి కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలించారని, గొల్లపల్లె సమీపంలో చెల్లని చెక్కుతో క్వారీ కొనుగోలు చేశారని, బలవం తంగా కొందరి క్వారీలను లాక్కున్నారని ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలున్నాయి. చెల్లని చెక్కు వ్యవహారం ఇప్పటికే కర్ణాటక కేజీఎఫ్‌ కోర్టులో నడుస్తోంది.

      పలమనేరు సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అండతోనే పేదల ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్నారని,అలాగే వీకోటలో ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. జగనన్న కాలనీలో అక్రమాలతోపాటు తాజాగా ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానిని 70 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దౌర్జన్యంగా స్థలాలు ఆక్రమించుకున్న వారికి వెంకటేగౌడ రాజకీయ పదవులు కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది . గతంలో జాఫర్ అనే వ్యక్తి జగనన్న కాలనీలో అక్రమాలకు పాల్పడ్డాడని టిడిపి నాయకులు కార్యకర్తలు రోడ్డు ఎక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈసారి వైసీపీ అధిష్టానం వెంకటే గౌడకు టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని పెద్దపంజాణి, గంగవరం మండలాల సొంతపార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. ఇక, వెంకటేగౌడ సొంత మండలమైనవి. కోటలోనూ ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం బలంగా ఉంది. అని చెప్పుకోవచ్చు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైసీపీకి, ఎమ్మెల్యేకి వ్యతిరేకత బలంగా ఉందనే విషయం తెలుస్తోంది. వైసీపీ చేసుకున్న సర్వేలో వెంకటేగౌడ మీద వ్యతిరేకత ఉందని సమాచారం. దీనికి తోడు నియోజకవర్గం లోని నాయకులు పెద్దిరెడ్డిని కలిసి వెంకటే గౌడకు టికెట్‌ ఇవ్వద్దని కోరినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ ఏడు జాబితాలోనూ వెంకటే గౌడకు స్పష్టత ఇవ్వనట్లు ప్రచారం జరుగుతోంది.

      పలమనేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పుడో చెప్పాను కదా…. టికెట్‌ నా జేబులో ఉందని. ఇప్పుడు కొత్తగా మాట్లాడు తున్నారు. అంటూ పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ వ్యాఖ్యానించారు. సుమారు వారం రోజులుగా వార్తలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే.. శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో కలిసి పలమనేరులో యాత్ర-2 సినిమా చూశారు. అనంత రం బయటకు వచ్చిన ఆయనతో.. పలమనేరు టికెట్‌ ఎవరికో వస్తుందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోందన్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. టికెట్‌ తన జేబులో ఉందని పేర్కొన్నారు. మరి,జేబు లో టికెట్‌ ఉన్నా.. వైసీపీ అధిష్ఠానం ఏడుసార్లు ప్రకటించిన జాబితాల్లో వెంకటేగౌడ పేరు ఎందుకు లేదబ్బా అంటూ నాయకుల్లో చర్చ సాగుతోంది.

        టీడీపీ నేత సుభా‌ష్ చంద్రబోస్‌ ఇటీవల సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. పలమనేరు టికెట్‌ మాట తీసుకునే ఆర్. వి. సుభాష్ వైసీపీలో చేరారనే ప్రచారం ఊపందుకుంది.. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్‌ అయిపోయారు. ఈమధ్య జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు కూడా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈయనకు అధిష్ఠానం అండ ఉండడంతోనే అనూహ్యంగా జడ్పీ చైర్మన్‌ అయిన విషయం తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం అప్పట్లో జరిగినా ఇప్పుడు ఆ ప్రస్తావన లేదు. ఇక నాలుగు రోజులు నుంచి ఎమ్మెల్యే సీటు నాకు ఇస్తే, కచ్చితంగా గెలిపించుకుంటానని ఐదు మండ లాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు నాకు మద్దతిస్తారని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి దాకా వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక జెడ్పీ చైర్మన్ వాసుకి సీటు ఇస్తే గెలుస్తాడా లేదా అనేది వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.

        యాదమరి మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్‌రెడ్డి పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఈయన జడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనుంజయరెడ్డికి సోదరుడు. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు విషయాల్లో మోహన్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ మోహన్‌రెడ్డి పేరు పలమనేరులో జోరుగానే వినిపించింది. ఇక కొత్తగా మంత్రి రోజా పేరు కూడా తెరపైకి వస్తుంది ఈసారి ఎలాగైనా పలమనేరు నియోజ కవర్గం లో దీటైన వ్యక్తిని దింపాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఇక పలమనేరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని దింపుతారు …వైసిపి అధిష్టానం అమర్ నాథ్ రెడ్డికి దీటైన వ్యక్తిని బరిలోకి దింపుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో వైసీపీ చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల వద్దకే వెళ్లి, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో బిజీబిజీగా గడుపుతున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఇక నిన్న తాజాగా వీకోట మండలంలో వైసీపీ నుంచి 30 కుటుంబాలు టీడీపీలో చేరడంతో మళ్లీ పలమనేరు నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరడం ఖాయం అంటున్నారు అమర్నాద్ రెడ్డి.

      ఈసారి పలమనేరు నియోజకవర్గంలో ఎలాగైనా టిడిపిని గద్ద దించాలని ఆలోచనలో అటు వైసిపి అధిష్టానం … మంత్రి పెద్దిరెడ్డి కంకణం కట్టుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వైసీపీలో రోజుకు ఒక నాయకుడు పుట్టుకొస్తుంటే టీడీపికి కంచుకోటగా ఉన్న పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వైసీపీ తరపున పలమనేరు బరిలోకి ఎవరిని దింపుతారా అని స్థానిక నేతలు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్